Hansika Love Again That Star Hero Will Marriage Soon?
Hansika : కేవలం పదిహేనేళ్ల వయస్సులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ల జాబితాలో మిల్కీబ్యూటీ హన్సిక పేరు మొదట వినిపిస్తుంది. బాల నటిగా చిన్నతనం నుంచే పలు సినిమాల్లో నటించిన హన్సిక.. ఉన్నట్టుండి కొంతకాలం కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా మళ్లీ అదిరిపోయే అందం, గ్లామర్, బాడీ స్ట్రక్చర్‌తో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతో అటు ఫిలిం ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
హన్సిక తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో వెండితెరపై కనిపించింది.అప్పుడు హన్సిక అందం, గ్లామర్ షో చూసి ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరుసటి రోజు నుంచి ఆమెకు ఫాలోవర్స్ గా మారిపోయారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి ఈ అమ్మడుకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసిన హన్సిక అలనాటి సీనియర్ నటి కుష్బును పోలి ఉందని చాలా మంది మాట్లాడారు. అంతేకాకుండా హన్సిక కోసం ఫ్యాన్స్ గుడి కట్టారని కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా హన్సిక పెళ్లిచేసుకోబోతోందని టాక్ వినిపిస్తోంది.
Hansika Love Again That Star Hero Will Marriage Soon?
కోలీవుడ్ లవర్ బాయ్ శింబు, హన్సిక గతంలో లవ్‌లో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరు డేటింగ్‌లో కూడా ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగింది. కానీ అనుకోకుండా వీరిద్దరూ విడిపోయారు. శింబు,హన్సిక ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రియురాలి కోసం శింబు ఏదైనా చేసేవాడు.ఆమె ఫారిన్ షూటింగ్‌కు వెళ్లిందని తెలిసి అక్కడికి కూడా వెళ్లేవారని తెలిసింది. అనుకోకుండా అయిన బ్రేకప్ తరవాత చాలా కాలం పాటూ వీరిద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. ఇటీవల హన్సిక ఒక యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేయగా.. ఓ అభిమాని శింబు గురించి అడుగగా ప్రేమలో విడిపోయిన వాళ్లు స్నేహితులుగా ఉండలేరా? అని ప్రశ్నించింది అంట.. అంటే వీరు మళ్లి కలిసిపోయారని అంతా భావించారు. ఈ క్రమంలోనే హన్సిక శింబుతో పెళ్లికి సై అన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.