Hansika : హన్సిక పెళ్లికి రెడీ అయ్యింది.. అబ్బాయి ఎవరో మీరు అసలు ఊహించలేరు
Hansika : హన్సిక మొత్వానీ గురించి తెలుసు కదా. దేశముదురు సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క సినిమాతోనే హన్సిక తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. నిజానికి.. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో కొన్నేళ్ల క్రితమే నటించింది. 2004 లో కోయి మిల్ గయా అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత దేశముదురు సినిమాలో ఏకంగా 16 ఏళ్లకే హీరోయిన్ అయింది. ఆ తర్వాత తనకు ఒక్కసారిగా రేంజ్ పెరిగింది.
ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన హన్సిక ఆ తర్వాత ఎందుకో ఎక్కువగా అవకాశాలను అందుకోలేకపోయింది. కోలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది హన్సిక. ఇప్పటి వరకు తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 50 సినిమాల్లో నటించింది హన్సిక. ప్రస్తుతం ఎక్కువగా తమిళం ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన హన్సిక.. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. అయితే.. హన్సిక త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

hansika ready to get married soon
Hansika : రాజస్థాన్ లో పెళ్లి చేసుకోబోతున్న హన్సిక
ఈ డిసెంబర్ లో రాజస్థాన్ లోని జైపూర్ కోటలో హన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. వరుడు ఎవరు అనేది మాత్రం తెలియదు. తన బంధువుల అబ్బాయే అని అంటున్నారు. ఇంతకీ ఆ వరుడు ఎవరు.. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకు జరుపుకుంటోంది హన్సిక అనేది మాత్రం తెలియదు. మొత్తానికి తెలుగులో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హన్సిక మొత్తానికి ఓ ఇంటిది కాబోతోంది అన్నమాట. మరి.. తన కెరీర్ ను పెళ్లి తర్వాత కూడా కొనసాగిస్తుందా? లేక పెళ్లితో తన సినిమా కెరీర్ కు ముగింపు పలుకుతుందా అనేది మాత్రం తెలియదు.