Happy Birthday Mahesh Babu : మహేష్ బాబు- రాజమౌళి ప్రీలుక్ విడుదల.. అప్‌డేట్ అదిరిపోయింది..!
ప్రధానాంశాలు:
Happy Birthday Mahesh Babu : మహేష్ బాబు- రాజమౌళి ప్రీలుక్ విడుదల.. అప్‌డేట్ అదిరిపోయింది..!
Happy Birthday Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై ఇప్పిటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది…

Happy Birthday Mahesh Babu : మహేష్ బాబు- రాజమౌళి ప్రీలుక్ విడుదల.. అప్‌డేట్ అదిరిపోయింది..!
Happy Birthday Mahesh Babu : అంచనాలు పీక్స్..
ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. ఈ సందర్బంగా మహేష్ పోస్టర్ రివీల్ చేస్తూ.. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 2025లో షేర్ చేయనున్నట్లు తెలిపారు. జక్కన్న షేర్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు మెడలో త్రిశూలం నందితో కూడిన ఒక లాకెట్ ధరించి కనిపిస్తున్నారు.ఈ లాకెట్ తోపాటు మెడపై నుంచి రక్తం కారుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది.
మహేష్ బాబు, రాజమౌళి సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ – ‘సలార్’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ హీరో మాధవన్ సైతం నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.