Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే రికార్డ్..!
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే రికార్డ్..!
Hari Hara Veera Mallu : బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ Pawan Kalan నుండి వచ్చిన తాజా చిత్రం హరి హర వీరమల్లు. Adnhra pradesh ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన తొలి చిత్రం ఇదే. దీంతో ఈ సినిమా కోసం పవన్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. దాదాపు ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది.

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే రికార్డ్..!
Hari Hara Veera Mallu : భారీ కలెక్షన్స్..
భారీ అంచనాల మధ్య జూలై 24న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదలైంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్, యాక్షన్ స్వాగ్ బిగ్ స్క్రీన్ పై చూడడంతో అభిమానుల సంతోషం గురించి చెప్పక్కర్లేదు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ ట్విట్టర్ ఖాతాలో ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. ఇక విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ తోపాటు ఓపెనింగ్ డే గురువారం భారీ స్థాయిలో థియేటర్లు ఫుల్ అయ్యాయి.
ప్రీమియర్ షోతోపాటు ఓపెనింగ్ డే బెనిఫిడ్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ హౌస్ ఫుల్ షోలతో బాక్సాఫీస్ వద్ద తుఫానుగా నిలిచిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం మొదటి రోజే మన దేశంలో రూ.31.50 కోట్లు రాబట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రీమియర్ షోల ద్వారా ₹ 12.7 కోట్లు వసూలు చేసి, మొత్తం రూ.43.8 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ ప్రారంభ రోజున సగటున 57.39% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. అడ్వాన్స్ సేల్స్, మొదటి రోజు కలిపి హరిహర వీరమల్లు సినిమా గ్రాస్ పరంగా దాదాపు 65 నుంచి 70 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించిందని సమాచారం. దాదాపు 45 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిందని తెలుస్తుంది .