
Bigg Boss Hari Teja Shares Moral Quotation
Hari Teja : బుల్లితెరతో పాటు వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ హరితేజ. ఆమె కెరీర్ బిగ్ బాస్ షోకు ముందు బిగ్ బాస్ షో తరువాత అనేలా మారిపోయింది. అ ఆ సినిమాతో కమెడియన్‌గా మారిపోయారు. తెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ హరితేజ నవ్వులు పూయిస్తుంటారు. అలా హరితేజకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. హరితేజ గర్భం దాల్చడం, బేబీ బంప్ ఫోటో షూట్ చేయడం, గర్భవతిగా ఉన్న సమయంలోనే పబ్‌లో పాటలు పాడటం, డ్యాన్సులు వేయడం, ఇక శ్రీమంతం వేడుకల్లో అయితే హరితేజ చేసిన రచ్చ, వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
అన్నింటి కంటే ముఖ్యంగా డెలీవరి సమయంలో తాను పడిన కష్టాల గురించి హరితేజ చెప్పిన విషయాలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి.హరితేజ 2021 ఏప్రిల్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. భూమి దీపక్ రావ్ అని పాపకు నామకరణం చేశారు. భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, కోపంవస్తే భూకంపమే అంటూ.. కూతురు పేరు వెనుక అర్థం కూడా చెప్పింది హరితేజ. అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన కూతురికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో హరితేజ భీమ్లా నాయక్‌లోని లాలా పాట పాడుతుండగా, కూతురు కూడా ఆ పాటను హమ్ చేస్తుండడం గమనించవచ్చు.
Hari Teja in video viral
పుట్టుకతోనే తన కూతురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని హరితేజ అంటుంది.హరితేజ డెలివరీ సమయంలోనే కరోనా పాజిటివ్ అని రావడం, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించుకోకపోవడం, పుట్టబోయే బిడ్డకు కూడా ఏదైనా ప్రమాదం ఉంటుందా? అనే అనుమానం, సాయం చేసేందుకు కూడా ఎవ్వరూ లేరని, డెలీవరి వార్డులో మా ఆయనే సేవలు చేశారంటూ ఇలా తన వ్యథను అంతా వివరించారు. ప్రస్తుతం ఈ అమ్మడు పలు టీవీషోస్ చేస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది.
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
This website uses cookies.