Harika : మూన్నాళ్ల ముచ్చటే అయింది.. హారికకు ఎదురుదెబ్బ!

Authored By Cinema Desk | The Telugu News | Published on: March 11, 2021, 2:32 pm

Harika : బిగ్ బాస్ హారికకు బంపర్ ఆఫర్, అరుదైన గుర్తింపు అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. తెలంగాణ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌గా హారికను నియమించారంటూ.. వార్తలు వచ్చాయి. మహిళా దినోత్సవం సందర్భంగా అపాయింట్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే ఆ వార్తలు నిజమే అయినా కూడా.. వివాదాలతో అనేక మలుపులు తిరిగింది. చివరకు వచ్చినట్టే వచ్చిన ఆ అవకాశం చేజారిపోయింది.

తెలంగాణ టూరిజం మినిస్టర్‌కు తెలియకుండానే ఈ నియామకం జరిగిందట. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా మంత్రికి తెలియదట. నియామకం జరిగినట్టే తనకు తెలియదని మంత్రి అనడం దుమారం రేగింది. అయితే ఈ విషయం చిలికి చిలికి గాలివానలా మారింది. వెంటనే అధికారిక వెబ్ సైట్‌లో హారిక నియామకానికి సంబంధించిన పత్రాలు మాయమయ్యాయి. అయితే ఈ విషయంపై హారిక స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది.

Harika about Termionatin As Ambassador

Harika about Termionatin As Ambassador

Harika : హారికకు ఎదురుదెబ్బ!

కానీ చివరగా అవే నిజమయ్యాయి. హారిక ఇదే విషయాన్ని చెబుతూ హర్ట్ అయింది. జరిగిందేదో జరిగింది.. ఏం జరిగినా ముందుకు వెళ్లాలి.. నా జీవితంలో ఎత్తు పల్లాల్లో తోడు ఉన్న అందరికీ థ్యాంక్స్ అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తనను తీసేశారని నేరుగా చెప్పకుండా అసలు విషయాన్ని చెప్పేసింది. ఏం జరిగినా ముందుకు వెళ్లాల్సిందే అంటూ హారిక చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp