Hyper Aadi : వెయ్యి రూపాయాలకు కూడా వస్తారు.. హారిక, రోహిణి పరువుతీసిన ఆది

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 26 October 2021, 9:30 am

Hyper Aadi హైపర్ ఆది ఒక్కోసారి నిజంగా కావాలని అంటాడా? లేదా స్కిట్ ప్రకారం అంటాడో తెలియదు. తన స్కిట్లో కావాలనే కించపరిచేలా డైలాగ్స్ రాసుకుంటాడా? అన్నది తెలియదు.కానీ ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఒక్కోసారి అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా దీపావళికి సంబంధించిన ఈవెంట్ ప్రోమోను వదిలారు. ఇందులో ఐదుగురు హీరోయిన్లు అంటూ ఇంతకు ముందు ఓ ప్రోమోను వదిలారు. ప్రియమణి, రోజా, ఇంద్రజ, పూర్ణ, మన్నారో చోప్రాలను తీసుకొచ్చారు.

Hyper Aadi Satires On Rohini And Harika

Hyper Aadi Satires On Rohini And Harika

ఆ ఐదుగురు ఒకే స్టేజ్ ఉంటే? ఒకే సారి నవ్వితే? పర్ఫామెన్స్ చేస్తే ఎలా ఉంటుంది.. ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే అంటూ తగ్గేదేలే అనే ఈవెంట్ గురించి హింట్ ఇచ్చారు. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన మరో ప్రోమోను వదిలారు. ఇందులో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా ఆది అయితే హద్దులు లేకుండా దూసుకుపోయాడు. దీపావళి కాబట్టి టపాసులు, క్రాకర్స్ భాషల్లో మాట్లాడేశాడు. ఈ థౌజండ్ వాలా?కాల్చితే ఎలా ఉంటుందో తెలుసా? అని రామ్ ప్రసాద్ అంటాడు.

Hyper Aadi రెచ్చిపోయిన హైపర్ ఆది

Hyper Aadi Satires On Rohini And Harika

Hyper Aadi Satires On Rohini And Harika

అలా అనడంతో ఆది ఓ పంచ్ వేస్తాడు. నువ్ ఈ థౌజండ్ వాలా కాల్చితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నావ్? నేను మాత్రం వెయ్యి రూపాయలకు కూడా ఈవెంట్లకు వచ్చే వారి గురించి ఆలోచిస్తున్నా? అని అనడంతోనే కెమెరామెన్.. హారిక, రోహిణిలవైపు చూపించాడు. అంటే ఆది ఉద్దేశ్యం వారు వెయ్యి రూపాయాలకే ఈవెంట్లకు వస్తారని. అలా ఆది అనడంతో ఆ ఇద్దరి మొహాలు మాడిపోయాయి. దెబ్బకు షాక్ అయ్యారు. అలా ఈ ఈవెంట్‌లో ఆది అందరినీ ఆడుకున్నాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి