HariTeja : తల్లయ్యావ్ కదా? ఇలాంటివి అవసరమా?.. నటి హరితేజకు చేదు అనుభవం

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 26 December 2021, 3:40 pm

HariTeja : బిగ్ బాస్ షోతో హరితేజ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అంతకు ముందు బుల్లితెరపై పలు ధారావాహికల్లో నెగెటివ్ రోల్స్ చేసుకుంటూ కాలాన్ని గడిపింది. ఇక బిగ్ బాస్ షో అనంతరం ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. తనలోని మల్టీ టాలెంట్స్ అన్నీ కూడా ప్రపంచానికి తెలిసి వచ్చాయి. హరికథ చెప్పడంలో హరితేజ ఎంతటి ధిట్టో అర్థమైంది.

ఇక బిగ్ బాస్ షో తరువాత హరితేజకు వెండితెర మీద పుష్కలమైన అవకాశాలు వచ్చాయి. కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆమె వేసే సెటైర్లకు ఎంతో మంది అభిమానులున్నారు. ఇక నెట్టింట్లో తన ఫ్యాన్స్ కోసం ఆమె పాడే పాటలు అయితే ఓ లెవెల్‌లో ఉంటాయి. తన ఫాలోవర్లతో హరితేజ ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. ఈ మధ్యే హరితేజ తల్లి కూడా అయింది. తన పాపకు భూమి అని పేరు పెట్టేసింది.

Hariteja Gets Trolling For Dressing

Hariteja Gets Trolling For Dressing

HariTeja : హరితేజ డ్రెస్సింగ్‌పై చర్చ

వర్కవుట్లు చేసిన హరితేజ మళ్లీ తన పాతరూపంలోకి వచ్చింది. అయితే తాజాగా కాస్త హద్దలు దాటుతూ డ్రెస్ ధరించింది. ఎక్స్ పోజింగ్ చేయడంతో ఆమె అభిమానులు హర్ట్ అయ్యారు. పెళ్లయింది.. తల్లయ్యావ్.. బిడ్డ ఉంది.. ఇప్పుడు ఇలాంటి చెత్త డ్రెస్సులు, చెత్త వేషాలు అవసరమా? అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనేది ఆమె ఇష్టం అంటూ ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి