Hebbah Patel : అందాలను కూర్చి మతులు పోగొడుతున్న హెబ్బా పటేల్.. ఇదేందబ్బా అంటున్న ఫ్యాన్స్
Hebbah Patel : ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముంబై బ్యూటీ హెబ్బా పటేల్. ఈ అమ్మడు తొలి చిత్రంలోనే తన అందచందాలతో ఆకట్టుకుంది. ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది . కుమారి 21 ఎఫ్ చిత్రం తర్వాత అడపాదడపా సినిమాలు తప్ప మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ వచ్చిన సినిమా ఏది లేదు. సినిమా అవకాశాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలను పెడుతూ అభిమానులకి ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. గత కొన్ని రోజుల క్రితం హెబ్బా పెట్టిన కొన్ని ఫొటోల్లో కాస్త లావుగా ఉంది. కానీ ఇటీవలి ఫొటోల్లో మళ్ళీ గతంలో లాగే సన్నగా అయింది.
చివరిగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. ముద్దుగా, బొద్దుగా మారిన ఈ బ్యూటీ ఐటెం సాంగ్ తో అదరగొట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో నాలుగైదు చిత్రాల్లో నటిస్తోంది హేబా పటేల్. ‘తెలిసినవాళ్లే, గీతా, విలన్, ఓదెల రైల్వే స్టేషన్, ఆద్య’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో కొన్ని చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవి శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. హేబా పటేల్ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన క్యూట్‌నెస్‌తో మతులు పోగొడుతూ ఉంటుంది. కేక పెట్టించే అందాలతో మైమరిపిస్తుంది.

hebbah patel beautiful looks
Hebbah Patel : అదరగొట్టిన హెబ్బా..
తాజాగా హెబ్బే పటేల్ అదిరిపోయేలా పొట్టి దుస్తులలో అరాచకం సృష్టించింది. ఏందబ్భా ఇది అనేలా హెబ్బా పటేల్ అందాల అరాచకం సాగుతుంది. హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ లో సరికొత్త లుక్ లో థ్రిల్లింగ్ గా కనిపిస్తోంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది.