Rajashekar : రొమాన్స్ చేసుకోనివ్వరు!.. రాజశేఖర్ మాటలకు సుమ షాక్

Authored By Cinema Desk | The Telugu News | Published on: January 9, 2022, 2:00 pm

Rajashekar : బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి ఎంతో ప్రేక్షకాదరణ ఉంది. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకొని సరదాగా ప్రేక్షకులను సందడి చేస్తారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ కానుకగా ఈ కార్యక్రమానికి రాజశేఖర్ జీవిత కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ జీవిత శివానీ శివాత్మిక వారికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా సుమ రాజశేఖర్ కుటుంబానికి వెల్కమ్ చెబుతూ మీ అందరిని ఈ వేదికపై చూడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అదేవిధంగా రాజశేఖర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “శేఖర్” సినిమా గురించి సుమ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజశేఖర్ గారు.. ఈ శేఖర్ ని మేము సీరియస్ మూడ్ లో చూస్తామా లేక రొమాంటిక్ మూడ్ లో చూస్తామా అని అడగ్గానే వెంటనే రాజశేఖర్ రొమాన్స్.. రొమాన్స్ అంటూ సమాధానం చెప్పారు.

hero rajashekar comments at sankranthi special cash program

hero rajashekar comments at sankranthi special cash program

Rajashekar : రొమాంటిక్ అనగానే భయం వేసింది..

ఈ క్రమంలోనే రాజశేఖర్ కూతురు శివాత్మిక మాట్లాడుతూ రొమాంటిక్ అనగానే కాస్త భయం వేసింది. అని చెప్పడంతో సుమ ఎందుకని ప్రశ్నించగా నాన్న.. అనగానే హలో నాన్న అల్లరి ప్రియుడమ్మ అంటూ సుమ రాజశేఖర్ సినిమా గురించి గుర్తు చేశారు. శివాత్మిక మాట్లాడుతూ మేం ఏదైతే చూడకూడదు అనుకున్నామో అదే చూసాము అని అనగా వెంటనే సుమా ఏం చూడకూడదు అనుకున్నావని ప్రశ్నించారు. వెంటనే శివాత్మిక రొమాన్స్ అంటూ సమాధానం చెప్పారు… కాదండి ఇదెక్కడి ఘోరం అండి మీరు రొమాన్స్ చేస్తే చూడకూడదని వీలు కోరుకుంటున్నారు అని అనగా ..మాట్లాడినా కూడా వాళ్లు తిడతారు.. అంటూ రాజశేఖర్ సమాధానం చెప్పడంతో సుమా ఎంతో ఆశ్చర్యపోయింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp