Sankranti Festival : సంక్రాంతి కోడిపందాలతో కోటీశ్వరులుగా మారిన వైనం… రూ.1.53 కోట్ల పందెంతో జిల్లాలో కొత్త రికార్డు
ప్రధానాంశాలు:
Sankranti Festival : సంక్రాంతి కోడిపందాలతో కోటీశ్వరులుగా మారిన వైనం... రూ.1.53 కోట్ల పందెంతో జిల్లాలో కొత్త రికార్డు
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో రోజు నిర్వహించిన పందాలు ఈసారి మరింత భారీగా సాగాయి. సంప్రదాయ ఆటగా జరిగే కోడిపందాలు ఈ ఏడాది కోట్ల రూపాయల నగదు చేతులు మారే స్థాయికి చేరడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచాయి.తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరి ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ జరిగిన హై వోల్టేజ్ పోరులో గుడివాడకు చెందిన ప్రభాకర్ సేతువ కోడి, రాజమండ్రికి చెందిన రమేష్ డేగ కోడి తలపడ్డాయి. ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పందెంలో చివరికి రమేష్ డేగ కోడి విజయం సాధించింది. ఈ గెలుపుతో బరిలో ఉన్నవారిలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.
Sankranti Festival : సంక్రాంతి కోడిపందాలతో కోటీశ్వరులుగా మారిన వైనం… రూ.1.53 కోట్ల పందెంతో జిల్లాలో కొత్త రికార్డు
Sankranti Festival : కోటీశ్వరులు..
ఈ ఒక్క పందెంలోనే రూ.1.53 కోట్ల మేర పందెం కుదిరినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద పందెమని ప్రచారం జరుగుతోంది. ఒక్క మ్యాచ్‌తోనే కోటిన్నరకు పైగా నగదు చేతులు మారడం కోడిపందాల స్థాయిని స్పష్టంగా చూపుతోంది.పందాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలు, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. హైటెక్ బరులు, లగ్జరీ ఏర్పాట్లు, ప్రత్యేక సదుపాయాలతో ఈసారి కోడిపందాలు నిర్వహించడం గమనార్హం. సాధారణంగా లక్షల్లో జరిగే పందాలు ఈసారి కోట్లకు చేరడంతో పండుగ సందడి మరో స్థాయికి చేరింది.
సంప్రదాయం పేరుతో జరిగే ఈ కోడిపందాలు ప్రతి ఏటా వివాదాలకు దారి తీస్తున్నప్పటికీ, సంక్రాంతి వేళ తాడేపల్లిగూడెం పరిసరాల్లో మాత్రం ఈ ఆటకు తగ్గని క్రేజ్ కనిపిస్తోంది. ఈ ఏడాది నమోదైన భారీ పందెం జిల్లాలో కోడిపందాల చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందని స్థానికులు చెబుతున్నారు.