Ravi Teja : హీరో రవితేజ అత్యంత చెత్త నిర్ణయం !
Ravi Teja : హీరో రవితేజ తెలుసు కదా. ఆయన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నిజానికి రవితేజ కెరీర్ ఇప్పుడు అంత ఆశాజనకంగా ఏం లేదు. ఒక హిట్టు వస్తే.. మూడు నాలుగు వరుస ఫ్లాప్ లు ఆయన్ను పలకరిస్తున్నాయి. నిజానికి ఆయన ఎప్పుడో స్టార్ హీరో. ఇప్పుడు కొత్తగా నటుడిగా నిరూపించుకునేది ఏం లేదు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులకు రవితేజ దగ్గరయ్యారు. కానీ.. ఇప్పుడు తను ఎంచుకునే కథలు వర్కవుట్ కావడం లేదు. అందుకే.. రవితేజ రూట్ మార్చాలని నిర్ణయించుకున్నారట.
అందుకే.. వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించారు రవితేజ. ఈ మధ్య ఓ సినిమా వచ్చినా ఆ సినిమా అంతగా ఆడలేదు. అందుకే మూస ధోరణికి స్వస్తి పలికి సరికొత్త కథలకు ఓకే చెప్పేందుకు రవితేజ సిద్ధమయ్యారట. ఇటీవల కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్.. రవితేజకు ఇటీవల ఓ కథ చెప్పారట. ఆ కథ పిచ్చిగా నచ్చిందట రవితేజకు. అది ఓ కాలేజీ లెక్చరర్ పాత్ర. కాకపోతే చాలా డిఫరెంట్ గా ఉండటంతో రవితేజ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అందులో స్టూడెంట్ గా ఎవరైనా ఒక కుర్ర హీరోను తీసుకుంటారట. నిఖిల్ కానీ.. సిద్దు జొన్నలగడ్డ కానీ.. నిఖిల్ గానీ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Ravi Teja : సరికొత్త ప్రయోగాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్
వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజది కొత్త క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అలాంటి క్యారెక్టర్లు వస్తే చేయడానికి తాను సిద్ధం అని ప్రకటించారు రవితేజ. ఇటీవల తను హీరోగా వచ్చిన రావణాసుర సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా రూ.10 కోట్ల వరకు పెట్టాడట రవితేజ. ఆ సినిమా భారీ నష్టాలనే తీసుకొచ్చింది. అందుకే.. ఇంకాస్త వెరైటీగా కథలను సెలెక్ట్ చేసుకొని ప్రయోగాలు చేసేందుకు రవితేజ సిద్ధమవుతున్నారు. చూద్దాం మరి.. రవితేజ కెరీర్ ఇంకెంత వేగంగా దూసుకెళ్తుందో?