Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే హీరోలు. వీరిద్ద‌రికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దర్శకుడు హరీష్ శంకర్, తన మొదటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ‘మిరపకాయ్’ కథను మొదట ఎన్టీఆర్ కోసం రాసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

Jr Ntr రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : అలా ఎలా మిస్..

కథ వినగానే తారక్‌కు ఇది బాగా నచ్చిందట. స్క్రిప్ట్ ఫన్నీగా ఉంది, మాస్ & క్లాస్ మిక్స్ ఉన్నట్లు భావించిన తారక్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం.కానీ అనూహ్యంగా… రాత్రికి రాత్రే తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అసలు కారణం ఏమిటో కానీ, హరీష్ శంకర్‌కు మాత్రం ఇది పెద్ద షాక్. ఓకే చెప్పిన కథను చివరి నిమిషంలో వదులుకోవడం నైరాశ్యాన్ని కలిగించిందని తెలుస్తోంది.

అయితే అక్కడే కథ మలుపు తిరిగింది. అదే కథను హరీష్ శంకర్ రవితేజకు వినిపించగా, అతను వెంటనే ఒప్పేసుకున్నాడు. ఫలితంగా 2011లో విడుదలైన ‘మిరపకాయ్’ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. రవితేజ కామెడీ టైమింగ్, ఎనర్జీ, మాస్ అప్పీల్ సినిమాకు బలాన్ని చేకూర్చాయి. ఆ పాత్రలో రవితేజ పోర్ట్రేయల్ మిరపకాయలాగే ఘాటు అనిపించింది! ఎన్టీఆర్ మొదట ఈ కథను వదిలిపెట్టడం ఇప్పుడు ఒక ‘మిస్‌డ్ గోల్డెన్ ఛాన్స్’ లాగా మారింది. ఆ సమయంలో తారక్ ఈ కథను చేస్తే… ఆయన ఫిల్మోగ్రఫీలో మరో ఎంటర్‌టైనర్ జతయ్యేది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది