Bhartha mahasayulaku vignapthi | బాక్స్ ఆఫీస్ వద్ద ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్ .. అంచనాలకు తగ్గలేదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhartha mahasayulaku vignapthi | బాక్స్ ఆఫీస్ వద్ద ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్ .. అంచనాలకు తగ్గలేదు

 Authored By sandeep | The Telugu News | Updated on :14 January 2026,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Bhartha mahasayulaku vignapthi | బాక్స్ ఆఫీస్ వద్ద ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే కంటెంట్ పరంగా బాగానే స్పందన వచ్చినప్పటికీ, బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ మాత్రం అంచనా వేసిన స్థాయిలో నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్ మాత్రమే లభించడమే ప్రధాన కారణంగా మారింది. అదే సమయంలో పెద్ద సినిమాలైన ‘ది రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి సినిమా షోలు ఇప్పటికే మేజర్ థియేటర్లలో ఫిక్స్ కావడంతో, ఈ చిత్రానికి షోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు రవితేజ గత కొంతకాలంగా వచ్చిన సినిమాల ఫలితాల ప్రభావం కూడా ఈ సినిమాపై పడినట్లు కనిపిస్తోంది.

త‌గ్గేదేలే..

దీంతో కలెక్షన్ల పరంగా సినిమా తొలి రోజు ఆశించినంత ప్రభావం చూపలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం ప్రాంతంలో సుమారు 80 లక్షల రూపాయల షేర్‌ను సాధించగా, ఆంధ్రా–సీడెడ్ ప్రాంతాల్లో కలిపి దాదాపు 1.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు షేర్ సుమారు 2.3 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి సుమారు 60 లక్షల రూపాయల షేర్ వచ్చింది. దీంతో వరల్డ్ వైడ్‌గా సినిమా తొలి రోజు దాదాపు 2.9 కోట్ల షేర్, గ్రాస్ పరంగా సుమారు 5.20 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.

ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్‌గా నిలవాలంటే కనీసం 20 కోట్ల రూపాయల షేర్‌ను సాధించాల్సి ఉంటుంది. తొలి రోజు వచ్చిన కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే, క్లీన్ హిట్‌గా నిలవాలంటే ఇంకా దాదాపు 17 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే లిమిటెడ్ రిలీజ్ దృష్ట్యా ఓపెనింగ్స్ పర్వాలేదనిపించినప్పటికీ, రవితేజ గత చిత్రాల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. అయితే సినిమాకు వస్తున్న మంచి మాటలు, పండగ సీజన్ ఊపు దృష్ట్యా రానున్న రోజుల్లో కలెక్షన్లలో మెరుగైన జోరు చూపించి రికవరీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది