బిగ్బాస్ ముందు ఒక లెక్క బిగ్బాస్ తర్వాత ఒక లెక్క అన్నట్లుగా తనలోని కొత్త కోణాన్ని చూపించారు నటుడు శివాజీ. నిజానికి ఆయన బిగ్బాస్ కి రాకముందు ఆయనపై నెగిటివిటీ బాగా ఉండేది. దాదాపుగా 90కు పైగా సినిమాలలో నటించిన శివాజీ కి సినిమాలలో మంచి పేరు ఉంది కానీ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆయన తన పేరును చెడగొట్టేసుకున్నారు. మొదట బిజెపిలోకి చేరారు. తర్వాత టిడిపి పార్టీకి వీర విధేయుడిగా మారారు. గత ఎన్నికల టైం లో ఆపరేషన్ గరుడ అంటూ టిడిపి తరఫున వైసిపి పార్టీకి విరుద్ధంగా వీడియోలు చేశారు. వైసీపీకి బద్ధ శత్రువుగా మారారు.
అయితే ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు బయట చెప్పలేదు. అయితే బిగ్ బాస్ కి వచ్చాక తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. శివాజీ పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ బంధువు కాదట. ఈయనది గుంటూరు జిల్లా అయితే ఆమెది తెలంగాణ లోని నిజామాబాద్. వీళ్ళ కులాలు కూడా వేరే. ఈయన చౌదరి అయితే ఆమె గౌడ కుటుంబానికి చెందినది. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ తోడల్లుడు కూతురు శ్వేతానే శివాజీ పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంట. ఏదో ఫంక్షన్ లో వీరిద్దరూ కలిశారు అది కాస్త ఇలా ప్రేమకు దారితీసింది చివరకు పెళ్లి చేసుకున్నారు.
తన భార్య గురించి మాట్లాడుతూ శివాజీ తనని షూటింగ్లకి రావద్దని చెప్పారట. తనలోకం తనది సినిమాలు షూటింగ్లను పట్టించుకోదు అని అన్నారు. పిల్లలకు కూడా షూటింగ్ తెలియదు నార్మల్ స్కూల్లోనే చదువుకుంటున్నారు లగ్జరీస్ గా కాకుండా వాళ్లని నార్మల్గా పెంచుతున్నాను ఆర్థికంగా పర్వాలేదు మా భార్య ఫ్యామిలీ కూడా ఆస్తి ఉన్నవాళ్లే. ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేవని శివాజీ తెలిపారు. అయితే శివాజీ తనకు బంధువు వరుసైన చెల్లెల్ని లేపికెళ్ళి పెళ్లి చేసుకున్నాడనే వార్తలు రూమర్స్ అని తెలుస్తుంది. వారిద్దరూ కుల మతాలు వేరు. లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.