#image_title
Balakrishna : అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవడు.. వాడెవడో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ కి దమ్ము ఉంది కాబట్టి వచ్చాడు.. జూనియర్ ఎన్టీఆర్ కి ఉందో లేదో వెళ్లి వాడినే అడగండి. పెంట మీద రాయి వేస్లే అది తిరిగి మన మీదే పడుతుందిరా అంటూ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పరువు తీశారు. చంద్రబాబు అరెస్ట్ పై మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా దారుణంగా మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు అందరూ కేటీఆర్ జపం చేస్తున్నారు. మరి.. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి.. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే తీసుకుంటారా అని అడగ్గా.. అసలు బీఆర్ఎస్ లో ఉన్నదే టీడీపీ వాళ్లు. ముఖ్యమంత్రి కూడా ఇక్కడి నుంచి ట్రెయినింగ్ పొంది వెళ్లి ముఖ్యమంత్రి అయిన వ్యక్తే కదా అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
సినిమా వాళ్లు కూడా చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటి వరకు స్పందించలేదని మీడియా వాళ్లు అడగ్గా.. సినిమా వాళ్లు ఎవ్వరూ ఖండించకపోయినా నేను పట్టించుకోను. సినిమాకు సంబంధించింది కాదు.. రాజకీయాలకు సంబంధించింది అనడం తప్పే. వాళ్లూ పౌరులే అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించాడు. ఇంతలో ఎవరో జూనియర్ ఎన్టీఆర్ గురించి అడగ్గా.. వాడిని.. అంటూ అసలు సెక్షనే తీసేశాం దీంట్లో నుంచి అంటూ బాలయ్య మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా మీరు పట్టించుకోరా అని అడగ్గా.. ఐ డోంట్ కేర్.. బ్రో ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య సినిమా డైలాగ్స్ చెప్పుకొచ్చాడు.
#image_title
బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో టీడీపీనే లేదంటున్నారు. చూపిస్తాం.. తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉందో చూపిస్తాం అని బాలకృష్ణ సీరియస్ అయ్యారు. బురద మీద రాయి వేస్తే ఏమౌతుంది.. పెంట మీద రాయి వేస్తే ఏమౌతుంది.. మన మీదే పడుతుంది. వాళ్లకే అవన్నీ వదిలేస్తున్నాను.. అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అలాగే.. జనసేనతో పొత్తులపై కూడా బాలకృష్ణ స్పందించారు. త్వరలోనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.