Suman : మెగాస్టార్ అనగానే దాదాపు అందరు తెలుగు ప్రేక్షకులకు చిరంజీవి గుర్తుకు వస్తాడు. అంతగా మెగాస్టార్ అనే పదం చిరంజీవికి చేరువయ్యింది. మెగాస్టార్ ను తన ఇంటి పేరుగా మార్చుకున్న చిరంజీవి ఆ బిరుదుకి పూర్తి న్యాయం చేసే విధంగా వ్యవహరిస్తాడు అనడంలో సందేహం లేదు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అయితే కొందరు మెగాస్టార్ బిరుదు అనేది మరో సీనియర్ హీరో సుమన్ కి దక్కాల్సి ఉందని అంటూ ఉంటారు. 1980ల్లో సుమన్ మరియు చిరంజీవి పోటా పోటీగా సినిమాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో కొన్నిసార్లు చిరంజీవిపై చేయి సాధించగా, ఎక్కువ సార్లు సుమన్ పై చేయి సాధించాడు.
మరి కొన్నాళ్ల పాటు సుమన్ ఇండస్ట్రీలో పై చేయి కంటిన్యూ అయితే కచ్చితంగా మెగాస్టార్ బిరుదు ఆయనకే దక్కేది. కానీ హీరోగా మంచి ఫామ్ లో ఉండగా ఆయనపై తప్పుడు కేసు బనాయించి జైల్లో పెట్టించారు అంటూ ఇప్పటికి కూడా చాలా మంది ఆరోపిస్తూ ఉంటారు. అశ్లీల సినిమాల్లో నటిస్తున్నాడు అంటూ సుమన్ పై తప్పుడు ఆరోపణలు చేసి కొందరు ఆయనను కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగైదు సంవత్సరాల పాటు ఆ కేసు నడిచింది. ఆ కారణంగా సుమన్ మెగాస్టార్ అవ్వాల్సి ఉన్నా కూడా కనీసం ఆ సమయంలో సినిమాల్లో అవకాశాలు రావడమే గగనం అయింది. తాజాగా సుమన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 45 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా
బెంగళూరులో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా సుమన్ అభిమానులు సోషల్ మీడియాలో మళ్లీ అప్పటి ముచ్చటను చర్చించుకుంటున్నారు. మెగాస్టార్ సుమన్ అంటూ కొందరు మాట్లాడుతున్నారు. మొత్తానికి సుమన్ యొక్క 45 వసంతాల సినీ కెరియర్ లో మొదటి 15 నుండి 20 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా సాగింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డల్ అయింది. మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ సక్సెస్ అయ్యాడు, ఇప్పటికి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. మెగాస్టార్ బిరుదు దక్కకున్నా కూడా సుమన్ ఆ స్థాయినటుడే అంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.