Uday Kiran wife : ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా ..?

Authored By aruna | The Telugu News | Published on: August 3, 2023, 3:00 pm

Uday Kiran wife : తెలుగు పరిశ్రమ లోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీని ఏలేసిన స్టార్స్ ఎందరో ఉన్నారు. అందులో ఒకరే దివంగత నటుడు ఉదయ్ కిరణ్. ‘ చిత్రం ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత ‘ నువ్వు నేను ‘ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఉదయ్ కిరణ్ కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడుగా, లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరుస పరాజయాలు ఆయనను పలకరించాయి.

స్టార్ హీరోగా ఉన్న టైంలో ఉదయ్ కిరణ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మితను ప్రేమించారు. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కొన్నాళ్లకు ఉదయ్ కిరణ్ కొన్ని సినిమాలలో నటించారు కానీ ఆయనకు అంతగా సక్సెస్ రాలేదు. అయితే 2012లో నిషితా కిరణ్ అనే సాఫ్ట్వేర్ అమ్మాయిను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడం ఆయనను డిప్రెషన్ కి గురిచేసాయి. 2014లో ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్య అప్పట్లో సంచలనం అయింది. అప్పటికే ఆయనకు నిషిత తో పెళ్లి అయి రెండు సంవత్సరాలయింది. భర్త మరణంతో ఒంటరి అయిపోయింది. తన భర్త స్టార్ హీరో అని ఎంతగా మురిసిపోయిందో

hero Uday Kiran wife Nishitha Kiran present situation

hero Uday Kiran wife Nishitha Kiran present situation

ఆయన మరణించాక అంతే కృంగిపోయింది. అయితే ముందు నుంచే నిషిత ఉదయ్ కిరణ్ కు చేదోడు వాదోడుగా ఉండేది. వరుస పరాజయాలతో ఉన్న ఉదయ్ కిరణ్ కి అండగా ఉంది. పెళ్ళికి ముందు నుంచే ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా దానిని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆయన మరణం తర్వాత ఇప్పటివరకు నిషిత పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగా ఉంటూ తన ఉద్యోగం చేస్తూ జీవనం గడుపుతుంది. ప్రస్తుతం ఆమె ఫేస్బుక్ లాంటి పెద్ద సంస్థలో పనిచేస్తున్నారు. కుదిరినప్పుడల్లా ఆమె ఉదయ్ కిరణ్ పేరిట విరాళాలు ఇస్తూ ఉంటారు. ఎంగేజ్ లో ఉన్నప్పుడు భర్త మరణించినా నిషిత ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన భర్త పై ఉన్న స్వచ్ఛమైన ప్రేమను తెలియజేస్తుంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp