Uday Kiran Sister : ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా .. ఆయన అలాగే ఆమె జీవితం కూడా ??

Advertisement

Uday Kiran Sister : తెలుగు పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే హీరో ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలోకి స్టార్ హీరోగా తక్కువ టైంలోనే ఎదిగాడు. అలాగే అంతే తక్కువ టైంలోనే ఇండస్ట్రీని వదిలి వెళ్లడమే కాకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. సినిమాలకు దూరం అయ్యాను అన్న బాధతోనో ఏమో కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆయనను తలచుకుంటూనే ఉంటారు. స్టార్ హీరోగా ఉన్న ఉదయ్ కిరణ్ ఎందుకు ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఆయన తన ఫ్లాట్లో ఉరివేసుకొని చనిపోయారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే రీసెంట్ గా ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉదయ్ కిరణ్ సిస్టర్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సింగర్ పరణిక సూపర్ స్టార్ సింగర్స్ ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. పరణిక పెద్దమ్మ కొడుకు ఉదయ్ కిరణ్. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంది. గతంలో ఉదయ్ కిరణ్ కూడా వరుస ఆఫర్లతో స్టార్ హీరోగా బిజీ అయిపోయాడు. ఆ తర్వాత ఆఫర్స్ తగ్గిపోయాయి. అలా ఉదయ్ కిరణ్ హీరోగా వెనక పడిపోయాడు ఈ మనస్థాపంతోనే అతను ఉరి వేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

Advertisement
Hero Uday Kiran sister news
Uday Kiran Sister : ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా .. ఆయన అలాగే ఆమె జీవితం కూడా ??

ఇప్పుడు పరణిక కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. అయితే ఉదయ్ కిరణ్ డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ పరిణికకి అటువంటి సమస్యలు లేవు. పరిణిక పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే చాలా ఆలస్యంగా పరిణిక ఉదయ్ కిరణ్ సిస్టర్ అని వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె ఇండస్ట్రీలో చాలా సినిమాలకు పాటలు పాడారు. వరుసగా ఆఫర్లు అందుకున్న పరిణిక కొన్నాళ్లకు బ్యాక్ డ్రాప్ అయిపోయింది. అలా ఆమె కూడా తన అన్న ఉదయ్ కిరణ్ లాగా ఒక్కసారిగా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని ఒక్కసారిగా డల్ అయిపోయారు.

Advertisement
Advertisement