BhanuPriya : అప్పటి స్టార్ హీరోయిన్లలో ఒకరు భానుప్రియ. తన నటనతో, అందంతో, డాన్స్ తో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సినిమాలలో నటించింది. కేవలం హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. భానుప్రియ అంటే చాలు అందరికీ ఆమె అందమైన కళ్ళు గుర్తొస్తాయి. అంతలా ఆమె కళ్ళతో ఎట్రాక్ట్ చేసి నెమలిలా డాన్స్ వేస్తూ ఇండస్ట్రీలో గుర్తిండి పోయేలా చేసింది.
హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన భానుప్రియ రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించింది. ఈ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ కు తల్లిగా భానుప్రియకు మంచి పేరు వచ్చింది. అయితే ప్రస్తుతం భానుప్రియ చికిత్స లేని వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భానుప్రియ తన పర్సనల్ లైఫ్, సినీ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు మెమొరీ లాస్ వ్యాధి ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది.
భానుప్రియ మాట్లాడుతూ ఈ వ్యాధి నాకు ఎలా వచ్చిందో నాకే తెలియడం లేదు. మావారు చనిపోయినప్పటి నుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. నాకు అసలు ఏమి గుర్తు ఉండట్లేదు. ఒక ముద్ర చూసి అది దేనికి సంబంధించిందో చెప్పడం నాకు చాలా కష్టంగా ఉంది. అసలు డాన్స్ అయితే మర్చిపోయాను. దీంతో నా డ్రీం ప్రాజెక్ట్ అయిన డాన్స్ స్కూల్ ని కూడా ఆపేసుకున్నాను. నాకు తెలుసు ఈ వ్యాధికి చికిత్స లేదని, కాని కాలం తో పాటు ముందుకెళ్తున్నాను అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.