Rajamouli : రాజమౌళి మహేష్ బాబు సినిమా మీద వెంట్రుకలు నిక్కబొడుచుకునే బిగ్ బ్రేకింగ్ న్యూస్ !
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయి లో గుర్తింపు పొందాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కోసం కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. భారీ అడ్వెంచర్ కథ మహేష్ కోసం రెడీ అవుతుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే తాజాగా మహేష్ బాబు సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
రాజమౌళి మహేష్ తో ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కించబోతున్నట్లు టాక్. 1 నేనొక్కడినే సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా థ్రిల్లర్ కథాంశంతో తీయబోతున్నాడు అని గట్టిగానే వినిపిస్తుంది. ఈ సినిమా ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాతో రాజమౌళి ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది ‘ సర్కారు వారి పాట ‘ సినిమాతో సూపర్ హిట్టును అందుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అంతకుముందే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నాను. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ssmb28 సినిమా రాబోతోంది. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో సినిమా అంటే సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అని అభిమానులు భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా పూర్తి చేసుకున్న తర్వాత రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడని టాక్.