Star Heroine : ఈ ఫోటోలో ఉన్న పాప .. ఒకప్పుటి స్టార్ హీరోయిన్ ! గుర్తుపట్టారా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Star Heroine : ఈ ఫోటోలో ఉన్న పాప .. ఒకప్పుటి స్టార్ హీరోయిన్ ! గుర్తుపట్టారా..!!

Star Heroine : ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా తమ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరసన ‘ ఒంటరి ‘ సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 January 2023,7:00 pm

Star Heroine : ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా తమ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరసన ‘ ఒంటరి ‘ సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఆ హీరోయిన్ ఎవరో.

ఇంకెవరు స్టార్ హీరోయిన్ భావన. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒంటరి తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమాతో మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నీలపూరి గాజులు ఓనిలవేణి పాట లో ఈ బ్యూటీ అందాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాట కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో భావనకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత మలయాళ కన్నడ భాషల్లో నటించారు. అయితే ఈ హీరోయిన్ మీద 2017 ఫిబ్రవరి నెలలో లైంగిక దాడి జరిగింది.

Star Heroine bhavana childhood photo viral

Star Heroine bhavana childhood photo viral

అప్పట్లో ఈ న్యూస్ సంచలనంగా మారింది. ఇందులో మలయాళ హీరో దిలీప్ పేరు కూడా వినిపించింది. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. లైంగిక దాడి జరిగిన తర్వాత భావన చాలా ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ‘ప్రేమందామ్ను’, ‘పింక్ నోట్’, ‘కేస్ ఆఫ్ కొందాన’, ‘హంట్’ సినిమాలకు భావన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో హంట్ తప్ప మిగతా సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇకపోతే ఈమే చిన్నప్పటి ఫోటో లో ఎంతో అందంగా ఉన్నారని ఈ ఫోటోని చూసిన నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది