Mahesh Rajamouli Movie : సూపర్ స్టర్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుది. ఈ సినిమాను కె లె నారాయణ నిర్మిస్తుండగా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతున్నారని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ ని ఎంపిక చేసే పనుల్లో ఉన్నారు రాజమౌళి. ఈ సినిమాలో నటీనటుల ఎంపికలో కూడా రాజమౌళి తన పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారు. మహేష్ సినిమాలో ఇదివరకు కొరియన్ హీరోయిన్ ని తీసుకుంటారన్న టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాలో ఫైనల్ గా మన హీరోయిన్ నే లాక్ చేస్తున్నారట. ఇంతకీ మహేష్ రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కథానాయిక ఎవరు అంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే సెటిల్ అయిన పీసీ అదే ప్రియాంకా చోప్రా అని తెలుస్తుంది.
మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే అదే రేంజ్ ఉండాలి. ఐతే ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ భారీ అంచనాలతో వస్తుంది కాబట్టి సినిమాకు తగినట్టుగానే హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారు. అందుకే ప్రియాంకా చోప్రా అయితే అందుకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంకా చోప్రా ఇందియన్ సినిమాలు మానేసింది.
అక్కడే హాలీవుడ్ వెబ్ సీరీస్ లు చేసుకుంటూ వస్తుంది. ఐతే ఆఫ్టర్ లాంగ్ టైం ప్రియాంకా చోప్రా ఇండియన్ సినిమాకు ఓకే చెప్పబోతుందని తెలుస్తుంది. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన సినిమా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో మార్కెట్ ఉంటుందని ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. మరి ప్రియాంక చోప్రా నిజంగానే ఈ సినిమా చేస్తుందా లేదా అన్నది అఫీషియల్ అప్డేట్ వస్తేనే తెలుస్తుంది. మహేష్ ప్రియాంకా ఆన్ స్క్రీన్ జోడీ కడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. పీసీ ఇండియన్ సినిమాలు మానేసిన ఈ టైం లో తెలుగు సినిమా కోసం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. Mahesh, Rajamouli, Movie, Priyanka Chopra, RRR
Health Tips: ఇప్పుడున్న సమాజంలో అనేక టెన్షన్స్, ఒత్తిడిలు,ఎక్కువైపోయాయి. మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. ఎందుకంటే బిజీ లైఫ్ లో డబ్బు…
IRCTC : దేశం యొక్క రవాణా వ్యవస్థకు వెన్నెముక అయిన భారతీయ రైల్వేలు దాని విస్తృతమైన నెట్‌వర్క్‌తో ప్రతిరోజూ మిలియన్ల…
Allu Arjun : తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం ఉదయం హైదరాబాద్…
పుష్ప 2 తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ని 12 గంటల పాటు అరెస్ట్…
Tirupati Laddu : లడ్డూ వివాదం నేపథ్యంలో ఆలయ వంటశాలను పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)…
House : జీవన ప్రపంచం వేగంగా మారుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండా మీ కలల ఇంటిని నిర్మించడం గురించి ఆలోచిస్తున్నారా?…
Allu Arjun Lawyer : డిసెంబర్ 4 న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన…
Winter Eyes : చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో మీకు సహాయపడే ప్రతిదాన్ని మీరు చేస్తారు.…
This website uses cookies.