Star Heroine Love : పెళ్లి అయిన హీరోతో ప్రేమలో పడ్డ స్టార్‌ హీరోయిన్‌

 Authored By aruna | The Telugu News | Updated on :10 August 2022,9:20 pm

Star Heroine Love : ఆమె టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్. పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి సూపర్ హిట్స్ ను దక్కించుకుంది. రెండు మల్టీస్టారర్ సినిమాల్లో కూడా నటించింది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది గా నిలిచింది. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాల్లో నటించిన ఆ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తూ కెరియర్ చరమాంకంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి హీరోయిన్ ఇప్పుడు అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురు చూడాల్సింది పోయి ఎప్పుడు ఎప్పుడు సినిమాల నుండి వెళ్ళిపోదామా అన్నట్లుగా ఎదురు చూస్తోందట.

అందుకు కారణం ఆమె ఒక స్టార్ హీరో తో ప్రేమ వ్యవహారం సాగించడమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరో ఎవరు.. ఆయన వల్ల ఎందుకు ఆమె సినిమాలకు దూరం అవ్వాలి అనుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు విషయానికి వస్తే ఆ స్టార్ హీరో కి ఇప్పటికీ పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ కారణంగా ఆమె అతడికి భార్య కాలేక పోతుంది, కనుక సినిమాల నుండి దూరం అయిన తర్వాత అతడి తో సహజీవనం సాగించాలని ఆమె భావిస్తుందట. అందుకు గాను సదరు హీరో కూడా ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.

heroine love with married hero in film industry

heroine love with married hero in film industry

కుదిరితే ఆ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే త్వరలోనే ఒక విడాకుల వార్త వినే అవకాశం ఉంది. మరో వైపు వారిద్దరు హీరోయిన్ మరియు హీరోగా సినిమాల్లో నటించేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. కానీ వారిద్దరితో సినిమా చేసేందుకు ఏ ఒక్క నిర్మాత కూడా ముందుకు రావడం లేదు.. అందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పుడు ఆమెకు అవకాశాలు రావడం లేదు, ఆయన తో సినిమాలు చేసినా పర్వాలేదు కానీ ఆ సినిమాల్లో ఆమె హీరోయిన్ గా ఉంటే సినిమా కు మైనస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే ఆ హీరో గారు అడిగినా కూడా సదరు హీరోయిన్ అయితే వద్దు అంటూ నిర్మాతలు దర్శకులు అంటున్నారట.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి