Shoaib Akhtar : ఆసుపత్రిలో షోయబ్ అక్తర్.. మీ దీవెనలు కావాలి అంటూ ఎమోషనల్ పోస్ట్
Shoaib Akhtar : పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ క్రికెట్‌లోఎన్ని సంచలనాలు క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన షోయబ్ అకర్త్ 2000 సంవత్సరాల్లో అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా పేరు సాధించాడు. నిప్పులు చేరిగే బంతులతో బ్యాట్స్‌మెన్లను వణికించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా బంతిని విసిరిన బౌలర్‌గా రికార్డు షోయబ్ పేరిటనే ఉన్నది. అక్తర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 14 టీ20లు, 163 వన్డేలు, 46 టెస్టులు ఆడాడు. టీ20ల్లో 21 వికెట్లు, వన్డేల్లో 247, టెస్టుల్లో 178 వికెట్లు పడగొట్టాడు. గత కొన్నేళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్న అతను ఆస్పత్రిలో చేరి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
Shoaib Akhtar : ఎమోషనల్ నోట్..
ఆస్ట్రేలియా రాజాధాని మెల్‌బోర్న్‌లోని ఒక హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్న అక్తర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత మోకాలి సర్జరీ చేయించుకున్న అక్తర్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశాడు. గత కొంతకాలంగా మోకాలి గాయం బాధపెడుతుందని, దీని కారణంగా తన కెరీర్ చాలా త్వరగా ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. లేకుంటే మరో నాలుగైదేళ్లు తాను క్రికెట్‌ను ఆడి ఉండేవాడనని పేర్కొన్నాడు. అలా చేస్తే తాను వీల్‌చైర్‌కే పరిమితమవుతానని తనకు తెలుసునని.. అందుకే క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
నాలుగైదేళ్లు క్రికెట్ ఆడి ఉంటే మాత్రం కచ్చితంగా జీవితాంతం వీల్‌చైర్‌లోనే ఉండిపోయే వాడిని. ఎలాగోలా ఇన్నేళ్లకు సర్జరీ చేయించుకున్నా. కాస్త నొప్పిగా ఉంది. మీ ప్రార్థనలతో నేను తొందరగా కోలుకుంటానని ఆశిస్తున్నాను. ఇదే నా చివరి సర్జరీ కూడా కావాలని కోరుకుంటున్నా’ అని భావోద్వేగానికి గురయ్యాడు అక్తర్. కాగా బుల్లెట్ లాంటి బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఘనత ఈ ఫాస్ట్ బౌలర్‌ది. ఆయన బంతులు విసురుతుంటే అవతల ఎలాంటి బ్యాట్స్‌మెన్ ఉన్నా బెదిరిపోవల్సిందే..!
View this post on Instagram