Neha Shetty Angry On Journalist Suresh Kondeti
Neha Shetty : ఇటీవల కాలం లో హీరోయిన్స్ మరియు ఇతర సినిమా రంగ ప్రముఖులను జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొన్ని వారాల క్రితం శ్యామ్ సింగ్ రాయ్ సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ కృతి శెట్టిని ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్న చర్చ అంశమైంది. సినిమా లో ముద్దు సీన్లు రొమాంటిక్ సీన్ లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సాధారణం గా అయితే నాని ముద్దు అంటే మొహ మాటం అంటారు. మరి మీరు అతడితో ఎలా చేశారు, నాని ఎలాగు మొహమాటస్తుడు కనుక మీరు ఆ సీన్లలో లీడ్ తీసుకున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించింది. దాంతో హీరోయిన్ కృతి శెట్టి చిన్న పోయినట్లుగా చూసింది. అదే సమయంలో పక్కన ఉన్న సాయి పల్లవి స్పందిస్తూ ఇలాంటి ప్రశ్నలు అడగడం ఎంత వరకు భావ్యము అంటూ సీరియస్ అయింది. ఇలాంటి ప్రశ్నల వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటూ సాయిపల్లవి మొహం మీద చెప్పేసింది.
ఇప్పుడు అదే తరహా ప్రశ్న మరో హీరోయిన్ కూడా ఎదుర్కొంది.హీరోయిన్ పుట్టు మచ్చల గురించి ఈసారి జర్నలిస్ట్ అడగడం తో కాస్త సీరియస్ గానే ఈ వ్యవహారం మారింది. అసలు విషయానికి వస్తే సిద్దు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమం తర్వాత మీడియాతో చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఆ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు అయిన సురేష్ కొండేటి అనే వ్యక్తి హీరో సిద్దు తో హీరోయిన్ వంటి మీద ఉన్న పుట్టు మచ్చల గురించి ప్రశ్నించాడు. ట్రైలర్ లో హీరోయిన్ కి 16 పుట్టు మచ్చలు ఉన్నాయని అన్నారు కదా.. రియల్ గా హీరోయిన్ ఎన్ని పుట్టు మచ్చలు ఉన్నాయో లెక్కించారా.. ఆ అవకాశం మీకు వచ్చిందా అంటూ కొంటెగా ప్రశ్నించాడు.ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా హీరో సిద్దు దాట వేశారు.
Neha Shetty Angry On Journalist Suresh Kondeti
సురేష్ కొండేటి ఆ ప్రశ్నలు సిద్దును అడిగిన వీడియో ను హీరోయిన్ నేహా శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలాంటి ప్రశ్నలు అడగడం సిగ్గు చేటు.. మీతో పని చేసే ఆడ వారికి మరియు మీ ఇంటి ఆడ వారికి మీరు ఎంత గౌరవం ఇస్తున్నారో ఈ ప్రశ్నతో తెలిసింది అంటూ ఆ మెసేజ్ చేసింది. జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఏకంగా ట్విట్టర్ ద్వారా షేర్ చేసి ఏకిపారేసిన హీరోయిన్ ఆ జర్నలిస్ట్ పరువు తీసింది. మరోసారి ఎవరు కూడా ఇలా అడగకుండా హీరోయిన్ చేసిన పని పని చేస్తుందంటూ ప్రశంసలు దక్కించుకుంది. గతంలో కూడా ఇదే జర్నలిస్టు రాజమౌళి ని ఇబ్బంది పెట్టే ఒక ప్రశ్న అడిగాడు. ఆ సమయం లో రాజమౌళి కూడా సీరియస్ గా తీసుకుని ఆ జర్నలిస్టుని క్లాస్ పిలిచాడు. అయినా కూడా ఆయన తీరులో మార్పు రాలేదు. హీరోయిన్ వార్నింగ్ తో అయినా అతడు మారతాడో చూడాలి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.