Pawan kalyan : ప‌వన్ క‌ళ్యాణ్ వ‌ల‌న బ‌లైన హీరోయిన్స్‌లో రేణూ దేశాయ్‌తో పాటు వారు ఉన్నారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan kalyan : ప‌వన్ క‌ళ్యాణ్ వ‌ల‌న బ‌లైన హీరోయిన్స్‌లో రేణూ దేశాయ్‌తో పాటు వారు ఉన్నారు..!

Pawan kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హీరోగా ఉన్న‌ప్పుడే ప‌వ‌న్ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉండేది. ఇక ఇప్పుడు ఆయ‌న డిప్యూటీ సీఎం కావ‌డంతో నిత్యం ప‌వ‌న్ గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైర‌ల్ అవుతూ ఉంటుంది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించాల‌ని చాలా మంది హీరోయిన్స్ క‌ల‌. కొంద‌రికి ప‌వ‌న్‌తో న‌టించడం వ‌ల‌న మంచి క్రేజ్ ద‌క్క‌గా, మ‌రి కొంద‌రి కెరీర్ గంగ‌లో క‌లిసిపోయింది . […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan kalyan : ప‌వన్ క‌ళ్యాణ్ వ‌ల‌న బ‌లైన హీరోయిన్స్‌లో రేణూ దేశాయ్‌తో పాటు వారు ఉన్నారు..!

Pawan kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హీరోగా ఉన్న‌ప్పుడే ప‌వ‌న్ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉండేది. ఇక ఇప్పుడు ఆయ‌న డిప్యూటీ సీఎం కావ‌డంతో నిత్యం ప‌వ‌న్ గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైర‌ల్ అవుతూ ఉంటుంది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించాల‌ని చాలా మంది హీరోయిన్స్ క‌ల‌. కొంద‌రికి ప‌వ‌న్‌తో న‌టించడం వ‌ల‌న మంచి క్రేజ్ ద‌క్క‌గా, మ‌రి కొంద‌రి కెరీర్ గంగ‌లో క‌లిసిపోయింది . పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నుండి నికీషా పటేల్ వరకూ ఈ లిస్ట్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు… అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ, పవన్ కళ్యాణ్ ‘ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. ఈ చిత్రం తర్వాత సుప్రియ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.

Pawan kalyan ప‌వ‌న్‌తో బ్యాడ్ సెంటిమెంట్..

పవన్ కళ్యాణ్-దేవయాని కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం సూపర్ హిట్ అందుకుంది. దేవయాని మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ఇక తొలిప్రేమ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. ఆ చిత్ర హీరోయిన్ కీర్తి రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. పరిశ్రమకు దూరమైన కీర్తి రెడ్డి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగానియా కూడా కెరీర్ లో ఎదగలేకపోయారు. ప్రీతి కూడా వివాహం చేసుకుంది. బద్రి సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అమీషా పటేల్,రేణూ దేశాయ్ కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని అధిగమించలేక పోయారు. ఇక గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది మీరా జాస్మిన్. ఈ మూవీ పరాజయం త‌ర్వాత మీరా కెరీర్ గంగ‌లోక‌లిసిపోయింది.

Pawan kalyan ప‌వన్ క‌ళ్యాణ్ వ‌ల‌న బ‌లైన హీరోయిన్స్‌లో రేణూ దేశాయ్‌తో పాటు వారు ఉన్నారు

Pawan kalyan : ప‌వన్ క‌ళ్యాణ్ వ‌ల‌న బ‌లైన హీరోయిన్స్‌లో రేణూ దేశాయ్‌తో పాటు వారు ఉన్నారు..!

బంగారం అంటూ బరిలో దిగిన మీరా చోప్రా పరిస్థితి కూడా చ‌తికిల ప‌డింది. ఇక జల్సాలో జతకట్టిన ఇలియానా కెరీర్ అనూహ్యంగా ముగిసింది. ప‌వన్ కళ్యాణ్ సెంటిమెంట్ కి బలైన మరో యంగ్ హీరోయిన్ నికీషా పటేల్. ఆమె హీరోయిన్ గా నటించిన పులి అట్టర్ ఫ్లాప్ అయ్యింది మెల్లగా ఫేడ్ అవుటై ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయింది. అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కీర్తి సురేష్ పవన్ సెంటిమెంట్ ని అధిగమించి స్టార్ అయ్యింది. అను ఇమ్మానియేల్ మాత్రం బలైంది. ఆమెకు కనీస అవకాశాలు లేవు. దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ప‌దికి మందికి పైగా హీరోయిన్స్ ప‌వన్ వ‌ల‌న కెరీర్‌లో చ‌తికిల‌బ‌డ్డారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది