Chiranjeevi : ఇటీవల సోషల్ మీడియాలో పాజిటివిటీ కన్నా నెగెటివిటీ ఎక్కువగా ఉంది. మొత్తం నెగిటివిటినే. సినిమా నచ్చకపోతే చెప్పండి కానీ ఇలా నెగిటివిటి చేసి ఏం సాధిస్తారు అంటూ daku maharaaj డాకు మహారాజ్ సక్సెస్ మీట్‌లో తమన్ Thaman ఎంతో ఆవేదనతో మాట్లాడాడు. తమన్ మాటలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఓ సక్సెస్ కోసం ఇండస్ట్రీలో ఎంతో కష్టపడతామని, ఓ సక్సెస్ వల్ల ఎంతో మంది బతుకుతుంటారు.. ఓ నిర్మాత ఎంతో కష్టపడి సినిమాను నిర్మిస్తాడని, ఎంతో ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో డబ్బు తెచ్చి సినిమాల్ని తీస్తే.. ఫ్యాన్స్ ఇలా నెగెటివ్ ట్రెండ్ చేసి సినిమాల్ని చంపడం చాలా బాధగా ఉందని, మన సినిమాల్ని మనమే చంపుకుంటూ బతుకుతున్నాం.. ఈ బతుకు కూడా బతుకునే అన్నట్టుగా తమన్ చాలా ఎమోషనల్ అయి మాట్లాడేశాడు.
తమన్ మాట్లాడిన మాటలకు మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi చలించిపోయినట్టుగా ఉన్నారు. తాజాగా తమన్‌ను ట్యాగ్ చేస్తూ చిరు ఓ ట్వీట్ వేశారు. ‘నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో.. ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ నీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, కొన్ని మాటలు ఇన్ స్పైర్ చేస్తాయి.. కొన్ని మాటలు నాశనం చేస్తాయి.. ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది’ అని అన్నారు.
ఇటీవల కాలంలో మూవీ రిలీజ్ అవ్వకముందే సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేయడం, సినిమాను లీక్ చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ Game Changer సినిమాకు చాలా రకాల నెగిటివిటీ వచ్చింది. దీనిపై తమన్ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. ప్రస్తుతం థమన్ డాకు మహరాజ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
Child Artist Revanth: రేవంత్ భీమల ... తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ బుడ్డోడు చేస్తున్న హంగామా మాములుగా లేదు.…
Virat Kohli : టీమిండియా Team India సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని Virat Kohli ఒకప్పుడు పరుగుల రారాజుగా…
WhatsApp New Features : ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన WhatsApp వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం…
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా Global star పేరు ప్రఖ్యాతలు…
Nagababu : ప్రముఖ సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు Nagababu మంత్రి అయినట్లేనని అంతా అంటున్నారు. రానున్న మార్చి…
PVC Aadhaar Card : నేటి ప్రపంచంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. మీరు బ్యాంకింగ్, ఆస్తి…
Local Body Elections : తెలంగాణలో Telangana వరుస ఎన్నికల సమరానికి సీఎం రేవంత్ Revanth reddy రంగాన్ని సిద్ధం…
NTR : టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు nandamuri taraka rama rao వర్ధంతి…
This website uses cookies.