Categories: NewsTelangana

Local Body Elections : ‘స్థానిక’ స‌మ‌రానికి రేవంత్ సై ! మ‌రి ప్ర‌తిప‌క్షాల సన్న‌ద్ధ‌త ఎంత మేర‌కు

Local Body Elections : తెలంగాణలో Telangana వ‌రుస ఎన్నిక‌ల స‌మ‌రానికి సీఎం రేవంత్ Revanth reddy రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. పథకాల అమలుకు ఈ నెల 26 ను ముహూర్తం తేదీగా ఇప్ప‌టికే ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేస్తుంది. ఎన్నికల ప్రక్రియలో దశల వారీగా పంచాయతీలు, ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉంటాయి. రాష్ట్ర సమగ్ర గృహ సర్వే నుండి డేటాను స్వీకరించిన తర్వాత అంకితమైన బీసీ కమిషన్ రిజర్వేషన్లను సిద్ధం చేస్తోంది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించే ముందు ప్రభుత్వం కమిషన్ నివేదికను ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది.జిల్లా అధికారులు ఇప్పటికే సన్నాహాలను ముమ్మరం చేశారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలు మరియు పోలింగ్ స్టేషన్ వివరాలను విడుదల చేశారు. అన్ని ప్రాంతాలలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి నోడల్ అధికారులను నియమించారు.

Local Body Elections : ‘స్థానిక’ స‌మ‌రానికి రేవంత్ సై ! మ‌రి ప్ర‌తిప‌క్షాల సన్న‌ద్ధ‌త ఎంత మేర‌కు

స్థానిక సంస్థల ఎన్నికలకు Local Body Elections ఈ సమయంలోనే వెళ్లాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఏఐసీసీ సైతం తాజాగా ఈ ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసిన‌ట్లు స‌మాచారం. BRS బీఆర్ఎస్, BJP  బీజేపీ ల‌ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తుంది. సీఎం రేవంత్ విదేశీ ప‌ర్య‌ట‌న‌ నుంచి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ప‌థ‌కాల అమ‌లును ఆలంబ‌న‌గా చేసుకుంటూ

ఈ నెల 26 నుంచి ప్ర‌భుత్వం సంక్షేమ‌ పథకాలను అమ‌లును ప్రారంభించ‌నుంది. రైతు భరోసా తో పాటుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది. ఈ స‌మ‌యంలోనే ఎన్నికల నిర్వహణ ద్వారా ఫలితాలు త‌మ‌కు అనుకూలంగా ఉంటాయని ప్ర‌భుత్వం అంచనా వేస్తుంది. ఇటీవ‌ల జరిగిన టీపీసీసీ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం Local Body Elections స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడు, నాలుగు వారాల్లో గ్రామ పంచాయతీలు Local Body Elections  , జిల్లా పరిషత్తులకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఫిబ్ర‌వ‌రిలో పంచాయ‌తీ మ‌రియు ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు

పార్టీ నేతల సమాచారం మేరకు ఫిబ్రవరి మూడో వారంలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీలకు, నాలుగో వారంలో MPTC ఎంపీటీసీ, ZPTC  జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్‌ పెంపు అంశం అవ‌రోదంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు కుల గణన జరుగుతోంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ సర్వే నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు స‌మాచారం.

Recent Posts

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

38 minutes ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

2 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

10 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

12 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

15 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

15 hours ago