holi special show rang de Jabardast Varsha cry due to bad comments
Jabardast Varsha : ఈటీవీ, మల్లెమాల వారు సంయుక్తంగా హోలీ సందర్భంగా రంగ్ దే అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ను తాజాగా విడుదల చేయడం జరిగింది. జబర్దస్త్ టీమ్ అంతా కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఉండడంతో ఎప్పటిలాగే సందడి సందడిగా జరిగిందని ప్రోమో ని చూస్తుంటే అర్ధం అవుతుంది. అయితే ప్రోమో లో వర్ష కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా ఆమెను అంతా కూడా అమ్మాయి అని కాకుండా మగాడు అంటూ పిలవడంతో ఆమె ఫీలవుతూ నే ఉంది. కామెడీగా అన్న కూడా పదే పదే ఆ మాట అనడం వల్ల ఆమె ఎక్కడో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది.
ఆ మధ్య ఒక షోలో ఇమాన్యుల్ తల్లి కూడా అదే మాట అనేసింది. అంత మాట అనడం తో ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. కానీ నవ్వుతూనే కనిపించింది. జబర్దస్త్ లో అందరు కూడా తమపై తాము పంచ్ లు వేసుకోవడం.. వేరే వాళ్ళు పై పంచులు వేయడం జరుగుతూ వస్తోంది. కనుక ప్రతి ఒక్కరు మగాడు అంటూ కామెంట్ చేయడం తో మంచి కామెడీ అయితే వస్తుంది. వర్ష ని మళ్ళీ మళ్ళీ మగాడు అంటూ పిలవడంతో ఆమె ఫీల్ అయినట్టు గా ప్రోమో లో చూపించారు. ఇమాన్యూల్ మాట్లాడుతూ నువ్వు వారితో కాదు ఇక్కడ వచ్చి కూర్చోవాలి అంటాడు దాంతో ఆమె చాలా ఫీల్ అయింది.వెక్కివెక్కి ఏడ్చుకుంటూ సెట్ నుండి వెళ్లిపోయినట్లు గా ప్రోమో లో చూపించారు.
holi special show rang de Jabardast Varsha cry due to bad comments
జబర్దస్త్ మరియు ఇతర ఈ టీవీ కార్యక్రమాల్లో ఇలాంటి ఫ్రాంక్ లు చాలానే చూశాం. కనుక ఇది నిజమా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే వర్ష చాలా ఫీల్ అయింది అనేది మాత్రం ప్రోమోలు చూపించడం జరిగింది. ఒకవేళ నిజమే అయినా కూడా అలా షూట్ కంటిన్యూ చేసే వారు కాదు. షూట్ కంటిన్యూ అయింది కనుక కచ్చితంగా ఇది ఫ్రాంక్ అయి ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వర్ష అంత చిన్న మాట కి అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.. కామెడీ కోసం అలా అని ఉంటారు అనేది చాలా మంది అభిప్రాయం. అసలు విషయం ఏంటి అనేది హోలీ సందర్భంగా టెలికాస్ట్ కాబోతున్నారా రంగ్ దే షో చూసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.