Janaki Kalaganaledu 14 March Today Episode : దొంగ డాక్టర్ జుమాంజి ఆటకట్టించిన జానకి.. మల్లిక వేసిన ప్లాన్ ను ఛేదించిన జానకి.. ఈ విషయం జ్ఞానాంబకు చెబుతుందా?

Janaki Kalaganaledu 14 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 256 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని అమ్మ చెప్పింది.. ఎల్లుండి నిశ్చితార్థం చేద్దాం అంటోంది అమ్మ అని జ్ఞానాంబకు చెబుతాడు గోవిందరాజు. దీంతో వెంటనే రామాను పిలిచి.. దిలీప్ వాళ్లకు ఫోన్ చేసి చెప్పండి. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందంట.. వాళ్లను రమ్మని చెప్పు అంటుంది. దీంతో సరే అమ్మ అంటాడు. ఇంతలో మల్లిక వస్తుంది. మల్లికను చూసిన జ్ఞానాంబ.. మల్లిక ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. దీంతో ఇప్పుడు వచ్చాను అత్తయ్య అంటుంది. మందులు తీసుకున్నావా అంటే తీసుకున్నా అంటుంది.

janaki kalaganaledu 14 march 2022 full episode

తీసుకున్నా అంటుంది. జానకి ఏది అని అడుగుతంది. దీంతో ఏదో పని ఉంది మీరు వెళ్లండి అని చెప్పింది.. అయినా జానకికి షికార్లు కొత్తేమీ కాదు కదా అంటుంది. దీంతో గోవిందరాజు మధ్యలో కలగజేసుకొని తనకు ఏదో పని ఉండి ఉండొచ్చు. అందుకే వెళ్లి ఉంటుందిలే అంటాడు. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. మరోవైపు జానకి.. జుమాంజి దగ్గరికి వచ్చి నీ పని అయిపోయింది అని అంటుంది. నీకు మందులు ఇచ్చాను కదా అప్పుడే అంటాడు. నువ్వు ఇచ్చిన మందులను ల్యాబ్ కు తీసుకెళ్లా. అవి పిచ్చి మొక్కలు అని తేలింది అని అంటుంది జానకి. నాకు ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసే విషపు మొక్కలు ఇచ్చావు అని అడుగుతుంది జానకి.

దీంతో నీ తోటి కొడలు జానకినే నీకు పిల్లలు పుట్టకుండా మందులు ఇవ్వమని చెప్పి డబ్బులు కూడా ఇచ్చింది అని డాక్టర్ జుమాంజి చెబుతాడు. దీంతో అతడిని పోలీసులకు పట్టించి కోపంతో ఇంటికి వస్తుంది జానకి. మల్లిక దగ్గరికి కోపంతో వచ్చి.. డబ్బులు తీసి మల్లికకు ఇస్తుంది.

ఇంతలో రామా, జ్ఞానాంబ, గోవిందరాజు అందరూ వస్తారు. ఏంటి ఈ డబ్బులు అని అడుగుతుంది. దీంతో నువ్వు ఆ జుమాంజి డాక్టర్ కు ఇచ్చిన డబ్బులు అంటుంది. ఇంతలో జ్ఞానాంబ వచ్చి ఇన్ని డబ్బులు అతడికి ఇవ్వడం ఏంటి అని అడుగుతుంది.

దీంతో అత్తయ్య గారు అసలు ఏం జరిగిందంటే.. అతడు నిజమైన నాటు వైద్యుడు కాదు అత్తయ్య గారు.. పిల్లలు లేని వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని దోచుకుంటున్నాడు అని చెబుతుంది. నువ్వు చెప్పేది నిజమా జానకి అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 14 March Today Episode : దొంగ డాక్టర్ గురించి జ్ఞానాంబకు చెప్పిన జానకి

దీంతో అవును అమ్మ..జానకి గారు చెప్పేది నిజం. ఆ దొంగ డాక్టర్ ను జానకి పోలీసులకు పట్టించింది అంటాడు రామా. మనవళ్లతో ఆడుకోవాలన్న పిచ్చి ఆరాటం కదా.. నీలావతి చెప్పగానే మిమ్మల్ని అక్కడికి వెళ్లమని చెప్పాను. ఇదంతా నా తొందరపాటు వల్లే.. అంటుంది జ్ఞానాంబ.

మీరు కోరుకున్నవి త్వరలోనే జరుగుతాయి. నమ్మకం ఉంచండి అత్తయ్య గారు అంటుంది జానకి. అయ్య బాబోయ్.. ఎక్కడ నేను చేసిన కుట్ర దగ్గర పడుతుందేమోనని భయపడ్డా అని అనుకుంటుంది మల్లిక. మల్లిక రూమ్ లోకి వెళ్లగానే.. మల్లిక దగ్గరికి వెళ్లి తలుపులు వేస్తుంది జానకి.

దీంతో మల్లిక షాక్ అవుతుంది. జానకి ఏంటి తలుపులు వేస్తున్నావు అంటుంది. నామీద నీకు ఉన్నది కేవలం చిన్న ద్వేషం అనుకున్నా కానీ.. నా మీద నీకు ఇంత కోపం ఉందని అనుకోలేదు. నా మాతృత్వాన్ని దెబ్బతీస్తావని అనుకోలేదు అంటుంది జానకి.

నువ్వు ఆ నాటు వైద్యుడితో కలిసి చేసిన నాటకం నాకు తెలియదు అనుకున్నావా? ఒక మహిళవు అయి ఉండి నువ్వు ఇలా చేస్తావా? వెన్నెల నిశ్చితార్థం పూర్తి కాగానే నీ విషయం అత్తయ్య గారికి చెబుతాను అంటుంది జానకి. దీంతో వద్దు జానకి. నీకు దండం పెడుతాను అంటుంది. ఇంతలో జ్ఞానాంబ తలుపు తీసి లోపలికి వస్తుంది.

ఏమైంది.. ఇద్దరు తలుపులు వేసుకొని మాట్లాడుతున్నారు అంటుంది. దీంతో ఆ దొంగ నాటు వైద్యుడు ఇచ్చిన మందులను మల్లిక తింటుందేమోనని భయపడి ఆ మందుల గురించి చెబుదామని వచ్చాను అత్తయ్య గారు అని అంటుంది జానకి.

సరె సరె.. వెన్నెల నిశ్చితార్థం కోసం రేపు ఉదయమే మనం బయలుదేరాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక నుంచి నువ్వు ఏపాటి బుద్ధిగా ఉంటావో నేను చూస్తా అంటుంది జానకి.

దీంతో సరే అన్నట్టుగా నటిస్తుంది మల్లిక. జానకి వెళ్లిపోగానే.. మళ్లీ ఏదో ప్లాన్ చేస్తుంది మల్లిక. ఎలాగైనా వెన్నెల నిశ్చితార్థాన్ని ఆపుతా అని అనుకుంటుంది. మరోవైపు వెన్నెల.. దిలీప్ తో మాట్లాడుతుండటం చూస్తుంది మల్లిక. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఈ పిల్ల.. వాడితో తెగ మాట్లాడుతోంది ఏంటి.. అని అనుకుంటుంది మల్లిక.

ఇది కరెక్ట్ కాదు వెన్నెల అంటుంది మల్లిక. మనసులోని ప్రేమను చంపేసుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతుంది. మీ ప్రేమను బతికించాలని నేను నడుం కట్టాను అంటుంది మల్లిక. కన్నబాబు ద్వారా నువ్వు ప్రేమించిన వాడి ఫోన్ నెంబర్ సంపాదించాను. వాళ్లతో మాట్లాడి నేను నీ పెళ్లి విషయం ఒప్పిస్తాను అని నాటకం ఆడుతుంది.

దీంతో వెంటనే దిలీప్ కు వెన్నెల ఫోన్ చేస్తుంది. విషయం చెబుతుండగా మల్లిక దొంగచాటుగా విని షాక్ అవుతుంది. అమ్మా.. ఇంత నాటకం ఆడి పెళ్లి చేస్తున్నారా అని అనుకుంటుంది మల్లిక. అమ్మో.. ఈ పెళ్లి వెనుక ఇంత కథ ఉందా. దీని వెనుక అంతా జానకి అన్నమాట అని అనుకుంటుంది.

పిట్ట కోసం వల వేస్తే కోడి పెట్ట దొరికింది. రేపు ఆ మహంకాలమ్మ ముందు పోలేరమ్మ ముందు నీ నాటకం బయటపెడతా అని శపథం చేస్తుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…

8 hours ago

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…

9 hours ago

Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మ‌తులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Hema Daughter : టాలీవుడ్‌ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

10 hours ago

Telangana : తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు..!

Telangana  : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…

11 hours ago

Chiranjeevi : పొలిటికల్ రీ ఎంట్రీ పై చిరంజీవి మరోసారి క్లారిటీ..!

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…

12 hours ago

Bakasura Restaurant Movie : బకాసుర రెస్టారెంట్‌ ఎంటర్‌టైన్‌ చేస్తూనే అందరి హృదయాలను హత్తుకుంటుంది : నటుడు ప్రవీణ్‌

Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…

12 hours ago

Chahal : మొత్తం నా భార్యే చేసింది.. చాహల్ – ధనశ్రీ విడాకుల వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ల యుద్దం..!

Chahal  : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…

13 hours ago

Anasuya And Rashmi Gautam : రష్మీ – అనసూయ మధ్య విభేదాలు.. ఏ విషయంలోనే తెలుసా..?

Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…

13 hours ago