Honey Rose : డబ్బుందనే గర్వం.. ఆ బిజినెస్‌మెన్ చాలా వేధిస్తున్నాడన్న హనీరోజ్
ప్రధానాంశాలు:
Honey Rose: డబ్బుందనే గర్వం.. ఆ బిజినెస్‌మెన్ చాలా వేధిస్తున్నాడన్న హనీరోజ్
Honey Rose : మలయాళ కథానాయిక హనీ రోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలయ్య సినిమా వీరసింహారెడ్డితో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ భామ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనని ఒక బిజినెస్‌మేన్ వెంబడిస్తున్నాడని, సోషల్ మీడియాల్లో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. అతడి చెడు ప్రవర్తన ఆగ్రహానికి గురిచేసిందంటూ ఆమె తెలియజేసింది. ఆ వ్యక్తి మొదట తనను ఒక కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించాడని, ఆ ఆహ్వానాన్ని తాను అంగీకరించానని పేర్కొంది.
Honey Rose వేధిస్తున్నాడు..
అతడి నుంచి మళ్లీ మళ్లీ ఆహ్వానాలు అందాయి. వాటిని తిరస్కరించిన తర్వాత ఆ వ్యక్తి ప్రతీకారం తీర్చుకునేందుకు తనను అవమానించడం ప్రారంభించాడని హనీరోజ్ తాజాగా రాసిన పోస్ట్‌లో పేర్కొంది. తాను పాల్గొనే కార్యక్రమాలలో తనను ఫాలో చేస్తున్నాడని హనీరోజ్ ఒక లేఖ (మలయాళ భాషలో) ద్వారా వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే తన నిరాడంబరతను కించపరిచేలా అతడు కామెంట్లు చేస్తున్నాడు.
లైంగికంగా కామెంట్లు చేయడం.. అలాంటి ఉద్దేశ్యంతో స్త్రీని వెంబడించడం ప్రాథమిక నేరాలు కాదా? అని హనీ రోజ్ ఈ లేఖలో ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలను తాను ధిక్కరిస్తానని.. సానుభూతితో విస్మరిస్తే చేతకాదనే అర్థం వస్తుందని కూడా హనీరోజ్ రాసారు.