Allu Arjun : సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు కంటే అల్లు అర్జున్ తోపు నటుడా? వాళ్లకు ఎందుకు అవార్డు రాలేదు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arjun : సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు కంటే అల్లు అర్జున్ తోపు నటుడా? వాళ్లకు ఎందుకు అవార్డు రాలేదు?

Allu Arjun : 69వ జాతీయ ఫిలిం అవార్డ్స్ లో తెలుగు ఇండస్ట్రీ తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలకు ఉత్తమ నటుడిగా అవార్డు రాలేదు. కానీ.. తొలిసారిగా పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. దీంతో సర్వత్రా ఈ అవార్డు గురించి చర్చ నడుస్తోంది. అసలు.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాని అవార్డు ఇప్పుడెలా వచ్చింది. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :28 August 2023,4:00 pm

Allu Arjun : 69వ జాతీయ ఫిలిం అవార్డ్స్ లో తెలుగు ఇండస్ట్రీ తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలకు ఉత్తమ నటుడిగా అవార్డు రాలేదు. కానీ.. తొలిసారిగా పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. దీంతో సర్వత్రా ఈ అవార్డు గురించి చర్చ నడుస్తోంది. అసలు.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాని అవార్డు ఇప్పుడెలా వచ్చింది. ఒక మగధీర, ఒక బాహుబలి, ఒక ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చాయి.

అయినా కూడా ఆ సినిమాల్లో నటించిన హీరోలకు రాని జాతీయ అవార్డు పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్ కు ఎలా వచ్చింది అని జనాలు గుసగుసలాడుతున్నారు. అంతే కాదు.. ఈ తరం వదిలేస్తే.. ఒకప్పటి తరం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని కాపాడిన తరం మహా నటులు సీనియర్ ఎన్టీఆర్ కు కూడా ఇప్పటి వరకు ఉత్తమ నటుడిగా అవార్డు రాలేదు. ఏఎన్నార్, కృష్ణ, మోహన్ బాబు, శోభన్ బాబు.. ఇలా ఆ తరం నటులకు ఎవ్వరికీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. అంటే.. ఆ తరం నటుల కంటే కూడా అల్లు అర్జున్ తోపు నటుడా అంటూ సినిమా విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

how Allu Arjun got national film award

Allu Arjun : సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు కంటే అల్లు అర్జున్ తోపు నటుడా? వాళ్లకు ఎందుకు అవార్డు రాలేదు?

Allu Arjun : చిరంజీవి కంటే కూడా అల్లు అర్జున్ గొప్ప నటుడా?

చివరకు కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవికి కూడా ఎప్పుడూ జాతీయ అవార్డు రాలేదు. ఆయన తరంలోని ఏ నటుడికి కూడా అవార్డు రాలేదు. ఇక.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపును తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. మరి.. ఆ సినిమాలో నటించిన హీరోల కంటే కూడా అల్లు అర్జున్ అంత గొప్పగా ఏం నటించారు. అసలు ఆ సినిమాలో ఏముందని.. ఏం అంతలా నటించారని అల్లు అర్జున్ కు ఆ అవార్డు వచ్చిందంటూ ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది. చూద్దాం మరి.. ఈ అవార్డు వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది