Pushpa : హైద‌రాబాద్ పోలీసులు అల్లు అర్జున్‌ని ఇలా వాడేశారేంటి.. త‌గ్గేదే లే అంటా..!

Authored By Sam C | The Telugu News | Published on: January 17, 2022, 7:00 pm

Pushpa : ప్ర‌స్తుతం పుష్ప మానియా మాములుగా లేదు. కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు దేశ‌మంతా పుష్ప మానియా న‌డుస్తుంది. క్రికెట‌ర్స్ అయితే పుష్ప ట్రాన్స్‌లో మునిగి తేలుతున్నారు. యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు సినీ ప్రేక్ష‌కులంతా ఫిదా అవుతున్నారు. అతీశ్ ఖ‌ర‌డే అనే ట్రాఫిక్ పోలీస్ ఏకంగా శ్రీ వ‌ల్లి అనే పాట‌కు మ‌రాఠీలో లిరిక్స్ రాసి మ‌రీ ఆల‌పించాడు. అంత‌టితో ఆగ‌కుండా అచ్చం బ‌న్నీలాగే స్టెప్స్ వేశాడు కూడా. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ప్రముఖ వాణిజ్య సంస్థ ‘అమూల్‌’ తన వ్యాపారం కోసం ‘పుష్పక్ ది స్లైస్‌.. అమూల్ హావ్ స‌మ్ అమ్ములు, అర్జున్‌..’ అనే కార్టూన్‌ను షేర్‌ చేసింది. దీనికి బన్నీ కూడా స్పందించాడు. దీంతో ఆ వాణిజ్య ప్రకటన వైరల్‌గా మారింది. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు పుష్పరాజ్‌ను వాడటం ఆసక్తికరంగా మారింది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమం గురించి ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నంలో భాగంగా పుష్ప సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్‌ హెల్మెట్‌ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు.

Hyderabad police used pushpa movie poster

Hyderabad police used pushpa movie poster

Pushpa : బ‌న్నీని వాడేసిన పోలీస్

ఆ ఫోటోపై మ‌ళ్ల త‌గ్గేదే లే అని రాసారు. ఈ ఫొటోని ట్రాఫిక్‌ పోలీస్‌ ట్విటర్‌ పేజీలో షేర్‌ చేశారు. ‘హెల్మెట్‌ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది.’ అంటూ ట్వీట్‌ చేశారు పోలీసులు. ఇక ఈ సినిమాలోని పాట‌ల‌కు ఫుల్ రెస్పాన్స్ రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఇందులోని ఏదో ఒక పాట‌కు త‌మ‌దైన శైలిలో డ్యాన్స్ చేస్తూ ర‌చ్చ లేపుతున్నారు. స‌మంత చేసిన ఊ అంటావా మావ పాట‌కు హుషారుగా డ్యాన్స్ చేస్తూ కేక పెట్టిస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp