Ram Charan : రంగస్థలం కాంబోకి పుష్ప టచ్.. సుక్కు ప్లాన్ చేశాడంటే ఇక అంతే..!
ప్రధానాంశాలు:
Ram Charan : రంగస్థలం కాంబోకి పుష్ప టచ్.. సుక్కు ప్లాన్ చేశాడంటే ఇక అంతే..!
Ram Charan : పుష్ప రెండు భాగాల తర్వాత సుకుమార్ తన నెక్స్ట్ సినిమాను రామ్ చరణ్ తో చేస్తాడన్న విషయం తెలిసిందే. ఆర్సీ 17వ సినిమాగా ఈ కాంబో ప్రాజెక్ట్ రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ను మెగా ఫ్యాన్స్ కి మెగా మాస్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. సుకుమార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి రంగస్థలం సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రంగస్థలం తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన సుక్కు పుష్ప 1, 2 తో పాన్ ఇండియా హిట్లు కొట్టాడు. ఇక సుకుమార్ తన తర్వాత సినిమా కూడా రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. ఐతే ఈ సినిమాకు పుష్ప టచ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అదేంటి చరణ్ సినిమాకు పుష్ప టచ్ ఏంటని ఆశ్చర్యపోవచ్చు. పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్ననే ఈ సినిమాలో తీసుకుంటున్నారట. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక అదరగొట్టేసింది.

Ram Charan : రంగస్థలం కాంబోకి పుష్ప టచ్.. సుక్కు ప్లాన్ చేశాడంటే ఇక అంతే..!
Ram Charan : రష్మిక ఇప్పటివరకు జత కట్టలేదు..
ఐతే చరణ్ తో రష్మిక ఇప్పటివరకు జత కట్టలేదు. అందుకే ఈ కాంబో ఫ్యాన్స్ ని మెప్పిస్తుందని సెట్ చేస్తున్నారట సుకుమార్. నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో సూపర్ ఫాం లో ఉంది. ఐతే ఇప్పుడు అమ్మడు చేతి నిండా సినిమాలు చేస్తుంది. సుకుమార్ తో మరో ఛాన్స్ అంటే నిజంగా అమ్మడికి లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. పుష్ప తర్వాత వరుస బాలీవుడ్ ఆఫర్లు అందుకుంటున్న రష్మికకు మరో లక్కీ ఛాన్స్ గా ఈ మూవీ ఆఫర్ వచ్చింది.
ఆర్సీ 17వ సినిమాగా రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో రష్మిక హీరోయిన్ గా నటిస్తే ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది. మరి ఈ మూవీతో అమ్మడు ఎలాంటి పాత్ర అందుకుంటుంది. సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది చూడాలి. సుకుమార్ మాత్రం ఈ సినిమా కోసం చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్టుగా ఉంది. ఆర్సీ 16వ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా కూడా స్పోర్ట్స్ డ్రామాగా అదరగొట్టేస్తుందని అంటున్నారు. Sukumar, Ram Charan, Pushpa, RC17, Rashmika Mandanna