Chiranjeevi : సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు.. గేమ్ ఛేంజర్ , పుష్పపై స్పందించిన చిరంజీవి..!
ప్రధానాంశాలు:
Chiranjeevi : సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు.. గేమ్ ఛేంజర్ , పుష్పపై స్పందించిన చిరంజీవి..!
Chiranjeevi : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ సినిమా Laila Movie ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్నో విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటేనని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ చిరంజీవి Chiranjeevi చెప్పారు. విశ్వక్ సేన్ vishwak sen ఈవెంట్‌కి తాను రావడానికి ఇలాంటి ఓ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశమే కారణమని చిరు అన్నారు. ఇక తమ మెగా హీరోలంతా ఒక్కటేనని.. అందరూ ఎప్పుడూ కలిసే ఉంటామంటూ చిరు అన్నారు.
![Chiranjeevi సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు గేమ్ ఛేంజర్ పుష్పపై స్పందించిన చిరంజీవి](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Chiranjeevi1.jpg)
Chiranjeevi : సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు.. గేమ్ ఛేంజర్ , పుష్పపై స్పందించిన చిరంజీవి..!
Chiranjeevi తనదైన స్టైల్‌లో ఇచ్చేశాడు..
పుష్ప 2 Pushpa 2 విజయం చూసి తాను గర్వపడినట్లు చిరు చెప్పారు. మా ఇంట్లో ఇంతమంది హీరోలు ఉన్నారు.. అందరూ ప్రతిసారి కలిసిమెలిసి ఉంటాం.. అన్నీ చేస్తాం.. అలా అని చెప్పి మా ఇమేజ్‌లు ఏమైనా తక్కువా? పవన్ కళ్యాణ్ Pawan Kalyanఏవీలో కనిపించగానే ఎలా వచ్చాయ్ విజిల్స్.. దానికి నేను గర్వపడాలి.. Allu Arjun పుష్ప 2 Pushpa 2 పెద్ద హిట్ అయింది.. బ్లాక్ బస్టర్ దానికి నేను గర్విస్తాను.ఒక్కోసారి సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు కానీ మనం ఏమైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ ఆనందపడాలి..
ఎందుకంటే ఒక సినిమా గురించి ఎన్నో వందలమంది కష్టపడతారు.. దానిపై బతుకుతారు.. కాబట్టి వాళ్ల బతుకు తెరువు కోసం వాళ్ల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనం హిట్ సినిమాలు చేయాలి.. ఏ హీరోకి హిట్ వచ్చినా అందరం ఆనందపడాలి.. ఎందుకంటే ఆ వచ్చిన డబ్బు ఎక్కడికో వెళ్లదు.. మళ్లీ మరో సినిమా చేయడానికే పెడతారు..” అంటూ చిరంజీవి Chiranjeevi అన్నారు. మొత్తానికి చిరు తన మాటలతో మెగా అల్లు వివాదంతో పాటు గేమ్ ఛేంజర్ నెగెటివ్ టాక్స్ గురించి కూడా మాట్లాడినట్టు అయింది.