Home » Entertainment » Hyper Aadi Comments About Pawan Kalyan And Dhee Show
Entertainment

Hyper Aadi : ఢీ షో కావాలా? పవన్ కళ్యాణ్ కావాలా? తేల్చుకో.. హైపర్ ఆదిని టార్గెట్ చేసిన ఆ నిర్మాత… వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Published on: February 9, 2023, 2:00 pm
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన నటుడు ఆయన. కమెడియన్ గా జబర్దస్త్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు ఏకంగా స్టార్ నటుడు అయిపోయాడు. పలు షోలలో మెరుస్తున్నారు. జనసేన పార్టీలో తిరుగుతున్నాడు. పెద్ద పెద్ద సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఆది రేంజ్ మారింది. అయితే.. జబర్దస్త్ నుంచి ఆది బయటికి వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

hyper aadi comments about pawan kalyan and dhee show

హైపర్ ఆది.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. తాజాగా తమిళ్ హీరో ధనుష్ నటించిన సినిమా సార్. ఈ సినిమా తెలుగులోనూ విడుదల అవుతోంది. వెంకీ అట్లూరి డైరెక్టర్. ఈ సినిమాలో హైపర్ ఆది కూడా ఒక క్యారెక్టర్ లో నటించాడు. ఈసందర్భంగా సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఆ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు.

Advertisement

hyper aadi comments about pawan kalyan and dhee show

Hyper Aadi : పవన్ కళ్యాణ్ సాంగ్ షూటింగ్ కే వెళ్లా

భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాన్ని ఈసందర్భంగా హైపర్ ఆది గుర్తు చేశాడు. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ జరుగుతుండగా పవన్ కళ్యాణ్ సాంగ్ లో నటించాల్సి ఉంది. అదే సమయంలో ఢీ షూటింగ్ ఉంది.  దీంతో నేను ఢీ షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది అని ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి ఫోన్ చేశాను. దీంతో నీకు ఢీ కావాలా? లేక పవన్ కళ్యాణ్ కావాలా? అని అడిగారు. దీంతో వెంటనే రెండు చేతులు జేబులో పెట్టుకొని అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ సాంగ్ షూటింగ్ కు వెళ్లాను.. అంటూ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి