Hyper Aadi : ఢీ షో కావాలా? పవన్ కళ్యాణ్ కావాలా? తేల్చుకో.. హైపర్ ఆదిని టార్గెట్ చేసిన ఆ నిర్మాత… వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 9, 2023, 2:00 pm

Hyper Aadi : హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన నటుడు ఆయన. కమెడియన్ గా జబర్దస్త్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు ఏకంగా స్టార్ నటుడు అయిపోయాడు. పలు షోలలో మెరుస్తున్నారు. జనసేన పార్టీలో తిరుగుతున్నాడు. పెద్ద పెద్ద సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఆది రేంజ్ మారింది. అయితే.. జబర్దస్త్ నుంచి ఆది బయటికి వచ్చిన విషయం తెలిసిందే.

హైపర్ ఆది.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. తాజాగా తమిళ్ హీరో ధనుష్ నటించిన సినిమా సార్. ఈ సినిమా తెలుగులోనూ విడుదల అవుతోంది. వెంకీ అట్లూరి డైరెక్టర్. ఈ సినిమాలో హైపర్ ఆది కూడా ఒక క్యారెక్టర్ లో నటించాడు. ఈసందర్భంగా సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఆ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు.

Hyper Aadi : పవన్ కళ్యాణ్ సాంగ్ షూటింగ్ కే వెళ్లా

భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాన్ని ఈసందర్భంగా హైపర్ ఆది గుర్తు చేశాడు. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ జరుగుతుండగా పవన్ కళ్యాణ్ సాంగ్ లో నటించాల్సి ఉంది. అదే సమయంలో ఢీ షూటింగ్ ఉంది.  దీంతో నేను ఢీ షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది అని ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి ఫోన్ చేశాను. దీంతో నీకు ఢీ కావాలా? లేక పవన్ కళ్యాణ్ కావాలా? అని అడిగారు. దీంతో వెంటనే రెండు చేతులు జేబులో పెట్టుకొని అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ సాంగ్ షూటింగ్ కు వెళ్లాను.. అంటూ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

Breaking News 2

No bio available for this author.

  1. "Puvvada Ajay Kumar : ఖమ్మంలో 800 ఇళ్లు కూల్చి 300 ఇళ్లు కట్టిస్తామంటారా?.. రేవంత్‌పై పువ్వాడ ఫైర్..!"

  2. "Odisha Viral News : బ్యాంకుకు అక్క అస్తిపంజరం మోసుకుని 3.5 కిలోమీటర్లు నడిచాడు.. చివరకు లక్షాధికారిగా మారిన తమ్ముడు!"

  3. "Gunde Ninda Gudi Gantalu Today Episode : రోహిణి ప్లాన్‌కు మనోజ్ విలవిల.. సుమతి పెళ్లిపై బాలు సంచలన నిర్ణయం!"

  4. "Gold Rate Today : 23 నవంబర్ 2026 బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయ్.. హైదరాబాద్, విజయవాడలో తాజా రేట్లు !"

  5. "Bigg Boss Telugu 10 : వంశీ మాటలకు తలదించుకుంటున్నా నాగార్జున..!"

  6. "AP Sarpanch Elections : సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామానికి రూ.1.50 కోట్లు ఇస్తా..!"

  7. "Hyderabad Bomb Threat : బ్రేకింగ్ న్యూస్‌.. హైదరాబాద్‌కు ఉగ్రదాడి బెదిరింపు మెయిల్.. పోలీసుల హై అలర్ట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp