Pawan Kalyan : వావ్‌ సూపర్‌… జనసేన కోసం ‘బిగ్ బాస్’ హోస్ట్‌ గా పవన్ కళ్యాణ్

Advertisement

Pawan Kalyan : జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉండాలని భావించాడు. కెరియర్ ఆరంభం నుండే పవన్ కళ్యాణ్ కి సినిమాలంటే ఆసక్తి లేదు. ప్రజా సేవ చేయాలని, లేదంటే ఇంకా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని కోరుకునేవాడు. కానీ అన్నయ్య చిరంజీవి ఆదేశం మేరకు సినిమాల్లో నటించాడు. కుటుంబం పోషణ కోసం మొదట సినిమాల్లో నటించాడు. ఇప్పుడు కేవలం జనసేన పార్టీ ఆర్థిక అవసరాల కోసం సినిమాలను చేస్తున్నాడు. ఈ విషయం ఆయన సన్నిహితులందరికీ తెలిసిందే. ఇటీవల నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి పెద్దగా ఆస్తులు లేవు.

pawan kalyan fans want he need to do Bigg Boss Telugu Hosting
pawan kalyan fans want he need to do Bigg Boss Telugu Hosting

అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఆ అప్పులను తీర్చడానికి మరియు జనసేన పార్టీ కార్యక్రమాల కోసం సినిమాలు చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. జనసేన పార్టీ యొక్క విరాళాలు భారీ స్థాయిలో ఉండడం లేదు. అధికారంలోకి వస్తుందో లేదో తెలియని పార్టీకి విరాళాలు ఇచ్చే ఆసక్తిని వ్యాపారవేత్తలు చూపించడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేసి జనసేన కోసం నిధులు సమీకరిస్తున్నాడు. ఈ సమయంలోనే ఆహా అన్‌ స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నందుకు గాను జనసేన పార్టీకి వారు భారీ ఎత్తున విరాళం ఇచ్చి ఉంటారు అనే ప్రచారం జరుగుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు బిగ్ బాస్

Advertisement
pawan kalyan fans want he need to do Bigg Boss Telugu Hosting
pawan kalyan fans want he need to do Bigg Boss Telugu Hosting

యొక్క కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హోస్టుగా వ్యవహరించి దాని ద్వారా వచ్చిన భారీ రెమ్యూనరేషన్ ని జనసేన పార్టీ యొక్క అవసరాల కోసం వాడుకుంటే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల యొక్క ఆలోచన బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేయక పోవచ్చు. ఎందుకంటే బుల్లి తెర పై పవన్ కళ్యాణ్ కి ఆసక్తి ఎక్కువగా ఉండదు.. పైగా హోస్టింగ్ చేసి సినిమాలు చేస్తూ పార్టీని నడిపించడం కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హోస్టింగ్ చేయక పోవచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ విషయంలో ఆశపడటం వృదా.

Advertisement
Advertisement