Hyper Aadi : ఎలక్షన్స్ తర్వాత రోజా పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్.. చాలాసార్లు పెళ్లి చేసినా కూడా..?
Hyper Aadi : స్మాల్ స్క్రీన్ పై జబర్దస్త్ కామెడీ షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ షో ద్వారానే చాలామంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. దాదాపు పదేళ్లుగా ఆ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఐతే జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకరు. బుల్లితెర మీద షోలు, సినిమాల్లో ఛాన్సులతో పాటుగా రాజకీయాల్లో కూడా ఆది బిజీగా కనిపిస్తాడు. ముఖ్యంగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారం లో పాల్గొన్నాడు ఆది. ఆది మైక్ అందుకున్నాడు అంటే మోత మోగిపోవాల్సిందే. ఐతే హైపర్ ఆది లేటెస్ట్ గా మాజీ మంత్రి ఒకప్పటి జబర్దస్త్ జడ్జి రోజా మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2024 ఎలక్షన్స్ తర్వాత రోజా గురించి మీ అభిప్రాయం ఏంటని హైపర్ ఆదిని అడిగితే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Hyper Aadi ఆమె అంటే ఎప్పుడు అభిమానం ఉంటుందంటూనే..
రోజా గారంటే ఇప్పటికీ అభిమానం ఉందని అన్నాడు హైపర్ ఆది. పాలిటిక్స్ లో ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తి ఇష్టం ఉంటుంది. రోజా గారికి ఒక వ్యక్తి అంటే ఇష్టం. నాకు మరో వ్యక్తి ఇష్టం. జబర్దత్ జడ్జిగా రోజా గారంటే తనకు గౌరవం ఉంది. మా లాంటి వాళ్లకు ఇంత పేరు వచ్చింది అంటే వాళ్ల వల్లే అని అన్నాడు హైపర్ ఆది. జడ్జిలుగా వారు చేసిన ఎంకరేజ్ మెంట్ వల్లే తాము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని అన్నాడు ఆది.
ఇక తన పెళ్లి గురించి అడిగితే ఆది షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. పెళ్లి ప్రస్తావన రాగానే ఇప్పటికే చాలాసార్లు షోలో పెళ్లి చేశారు. తప్పకుండా పెళ్లి గురించి ఆలోచన చేస్తే అందరికీ తెలియచేస్తానని అన్నాడు ఆది. మొత్తానికి రోజా పై జబర్దర్స్త్ కమెడియన్స్ కు కోపం ఉంటుందని అనుకోగా అది కేవలం రాజకీయాల వరకే ఆమె అంటే తమకు గౌరవం ఉందని అన్నాడు హైపర్ ఆది.