Hyper Aadi : ఎప్పుడూ వెనకాల ఉండటం కాదు.. అఖిల్ పరువుతీసిన హైపర్ ఆది

 Authored By prabhas | The Telugu News | Updated on :21 January 2022,6:30 pm

Hyper Aadi : అఖిల్ సార్థక్.. ఈ పేరు బిగ్ బాస్ షో టైంలో బాగానే వినిపించింది. అఖిల్‌ను విపరీతంగా ట్రోల్ చేసేవారు. అఖిల్ చివరకు లక్ కలిసి వచ్చి రన్నర్‌గా నిలిచాడు. అఖిల్ మీద వచ్చినన్నీ ట్రోలింగ్స్ ఇతర ఏ కంటెస్టెంట్ల మీద రాలేదు. కరివేపాకు అంటూ దారుణంగా తీసి పాడేసేవారు. బిగ్ బాస్ నాల్గో సీజన్ గడిచి ఏడాది అవుతున్నా ఇంత వరకు ఎలాంటి ప్రాజెక్టుల్లోనూ అఖిల్ కనిపించలేదు.

ఏవో వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేశాడు. కానీ వాటి గురించి ఇంత వరకు జాడలేదు. మొత్తానికి రాక రాక ఢీ షో చాన్స్ వచ్చింది. అసలే అఖిల్ ఎక్కువగా మాట్లాడలేడు. ముద్ద మొహం వేసుకుని ఉంటాడు. అలాంటి అఖిల్ ఢీ షోలో ఏ మాత్రం సర్దుకుంటాడా? అని అందరూ అనుకున్నారు. అందరూ ఊహించినట్టే ఆ షోకు అఖిల్ ఫిట్ కాలేదు.

Hyper Aadi Counters On Akhil Sarthak In Dhee Show

Hyper Aadi Counters On Akhil Sarthak In Dhee Show

Hyper Aadi : అఖిల్‌పై ఆది కౌంటర్లు..

ఆది నాలుగైదు పంచ్‌లు వేసుకోవడానికి మాత్రం అఖిల్ పనికొస్తున్నాడు. తాజాగా వదిలిన ప్రోమోలో అఖిల్‌ను ఆది దారుణంగా ఆడుకుంటాడు. అందరూ కలిసి అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం.. రాగం వెనుక అంటూ ఇలా పాడుతూ ఉంటారు. కానీ అఖిల్ మాత్రం రాగం వెనుక అంటూ ఆగిపోతాడు. ఇలా అందరి వెనకాల ఉండటం కాదు. రాగం వెనక ఏం ఉంటుందో తెలుసుకోవాలంటూ కౌంటర్ వేస్తాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి