Vishnupriya : ముద్దు, హగ్గు చేద్దాంమంటే అది అడ్డోస్తది.. విష్ణుప్రియపై హైపర్ ఆది కామెంట్స్.. వైరల్ వీడియో
Vishnupriya జబర్దస్త్ షోలో హైపర్ ఆది Hyper Aadi తన స్కిట్లలో వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తన టీంలో ఆర్టిస్ట్లను ఎలా కించపరుస్తాడో అందరికీ తెలిసిందే. అవి వినోదం కోసమే అయినా కూడా వారి శరీరాకృతి మీద పదే పదే కౌంటర్లు వేస్తుంటారు. శాంతి స్వరూప్ శరీరాకృతి మీద, దొరబాబు పరదేశీ వైజాగ్ ఘటన మీద వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా హైపర్ ఆది తిప్పి తిప్పి వాటి మీదే పంచ్‌లు వేస్తున్నాడు. ఇక స్పెషల్‌గా తీసుకొచ్చే గెస్టుల మీద కూడా అలాంటి కామెంట్లే చేస్తుంటాడు.

hyper aadi counters to vishnupriya in jabardasth
విష్ణుప్రియ పరువు మళ్లీ పాయే.. హైపర్ ఆది మామూలోడు కాదు Vishnupriya
విష్ణుప్రియ Vishnupriyaను అందరూ ఒకే రకంగా కామెంట్లు చేస్తుంటారు. అందరూ కలిసి ఆమె ముక్కు మీదే కౌంటర్లు వేస్తుంటారు. అదేంటి అంత ఉంది? అన్నట్టుగా పంచ్‌లు వేస్తుంటారు. ఎవరికైనా వయసు పెరుగుతుంది? ఇంకేదైనా పెరుగుతుంది? నీకేంటి ముక్కు పెరిగింది? అనేట్టుగా పంచ్‌లు వేస్తుంటారు. అలానే హైపర్ ఆది తాజాగా తన స్కిట్లో విష్ణుప్రియ ను పిలిచి మరీ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. కౌంటర్ల మీద కౌంటర్లు వేసి నానా హంగామా చేసేశాడు.

hyper aadi counters to vishnupriya in jabardasth
ముద్దు పెడదామంటే ముక్కు అడ్డం వస్తుంది.. హగ్ చేసుకుందామంటే నా పొట్ట అడ్డం వస్తుంది.. ఇంకేదైనా చేద్దామా? అని అంటే కెమెరాలు అడ్డం వస్తాయని డబుల్ మీనింగ్ డైలాగ్ వేసేశాడు. ఇక నీకు ఏదైనా మొక్కు ఉందా? అని విష్ణుప్రియ Vishnupriya ను అడిగేశాడు. లేదని ఆమె చెప్పింది. ఎందుకని తిరిగి ప్రశ్నిస్తే.. ముక్కు మరి ఎందుకు అంతలా పెంచుతున్నావ్ అని మరో సెటైర్ వేశాడు. ఇక ఇలా తన ముక్కు మీద హైపర్ ఆది Hyper Aadi వేసిన పంచ్‌లు వైరల్ అవుతున్నాయి.