Hyper Aadi : ఇంతకంటే అవమానం ఉంటుందా?.. టిక్ టాక్ భాను పరువుదీసిన హైపర్ ఆది..!
Hyper Aadi : హైపర్ ఆది వేసే పంచ్‌లు బుల్లితెరపై ఎలా పేలుతుంటాయో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఆ సెటైర్లు కాంట్రవర్సికి దారి తీస్తుంటాయి. ఇక హైపర్ ఆది తన స్కిట్‌లోని సభ్యుల మీదే ఎక్కువగా పంచ్‌లు వేసేవాడు. బాడీ షేమింగ్ మీద ఎక్కువగా సెటైర్లు వేస్తుంటాడు. అలాంటి ఆది తాజాగా టిక్ టాక్ భానుని దారుణంగా అవమానించాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఆది ఈ మధ్య దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆదివారం రానున్న ఎపిసోడ్ ప్రోమోను తాజాగా వదిలారు.
టిక్ టాక్ భాను పరువుదీసిన హైపర్ ఆది Hyper Aadi
ఇందులో ఆది దారుణంగా ఆడేసుకున్నాడు. రాఘవేంద్రరావు గెటప్‌లో గడ్డం నవీన్ సరిగ్గా సరిపోతుండటంతో అతనితోనే ఎక్కువగా స్కిట్లు వేస్తుంటారు. రాఘవేంద్ర రావు ఆ మధ్య ఓ షోను హోస్ట్ చేయడం, అందులో తన సినిమాల విశేషాలను చెబుతూ ఉండేవారు. సరిగ్గా అలాంటి షోకు స్ఫూప్‌గానే తాజాగా ఆది ఓ స్కిట్ వేశాడు. ఇందులో పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడుకున్నారు. రవళి, దీప్తి భట్నాగర్ పాత్రలకు డూపులుగా టిక్ టాక్ భాను, వర్షలను తీసుకొచ్చిపెట్టాడు.
వీళ్లే పెళ్లి సందడి హీరోయిన్లు అని గడ్డం నవీన్ చెప్పడంతో ఆది దారుణమైన కౌంటర్ వేశాడు. పెళ్లి పందిరిలో ఆకులు ఎత్తే వారిలా ఉన్నారు.. వాళ్లు హీరోయిన్లా? అని సెటైర్ వేసి పరువుతీశాడు. ఇంకా మరీ ముఖ్యంగా టిక్ టాక్ భానుని మాత్రం ఘోరంగా అవమానించేశాడు. టిక్ టాక్ భానుని చూపిస్తూ ఈమె రవళి అని గడ్డం నవీన్ అన్నాడు. దానికి ఆది కౌంటర్ వేస్తూ.. ఏంటి ఈమె రవళినా?.. రోడ్డు మీద పళ్లు పెట్టుకుని రావాలి రావాలి అని అరిచేదానిలా ఉంది? అంటూ దారుణంగా అవమానించేశాడు.
ఇది కూడా చదవండి ==> బిగ్‌బాస్ సీజన్ 5కు సర్వం సిద్దం.. జబర్దస్త్ , టిక్ టాక్ నుంచి కంటెస్టెంట్స్ వీరేనట..!
ఇది కూడా చదవండి ==> శేఖర్ మాస్టర్ కూడానా.. మరీ ఇంత దిగజారాలా.. వీడియో
ఇది కూడా చదవండి ==> ఊపు ఊపేసిన యాంకర్ విష్ణు ప్రియ.. నాభి అందాలతో రచ్చ.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి ==> ముగ్గురు మొనగాళ్ళు మూవీలో చిరుకి డూప్‌గా ఆ ఇద్దరు మొనగాళ్ళు వీరే…!