Home » Entertainment » Hyper Aadi Dont Want To Do Movies As Hero
Entertainment

Hyper Aadi : హైపర్ ఆది చాలా తెలివైనోడు బాసు… హీరో ఆఫర్‌ లకు రియాక్షన్‌!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 2, 2022, 1:00 pm
Advertisement

Hyper Aadi : అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్న వాడు భవిష్యత్తులో లాభపడతాడు.. సుఖ పడుతాడు.. సక్సెస్‌ అవుతాడు. అనుభవాల పాఠాలను పట్టించుకోని వాడు ప్లాప్‌ అవుతాడు.. నష్టపోతాడు.. ఫెయిల్‌ అవుతాడు. ఈ విషయం ఎన్నో సందర్బాల్లో నిరూపితం అయ్యింది. ఇప్పుడు హైపర్‌ ఆది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. లక్షల్లో పారితోషికం ఇచ్చి హీరోను చేస్తాం అంటూ ఆఫర్లు ఇస్తున్నా కూడా ఆది మాత్రం ఆసక్తి చూపడం లేదు. తన చెంతకు వచ్చిన పదుల కొద్ది ఆఫర్లను సున్నితంగా ఆది తిరష్కరించాడు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.

Advertisement

జబర్దస్త్‌ తో మంచి గుర్తింపు దక్కించుకున్న ధన్‌రాజ్ నుండి మొదలుకుని గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్ మరియు రామ్‌ ప్రసాద్‌ వరకు ఎంతో మంది కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా ప్రయత్నాలు చేసిన వారిలో ఒకరు ఇద్దరు పర్వాలేదు అనిపించినా ఎక్కువ శాతం మంది నిరాశ పర్చారు. ముఖ్యంగా ధన్‌ రాజ్‌ హీరోగా చేయడం వల్ల మళ్లీ జీరో పరిస్థితి కి పడి పోయాను అంటూ పలు సందర్బాల్లో కన్నీళ్లు పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. హీరోగా ధన్‌ రాజ్‌ చేసిన సినిమా ప్లాప్‌ అవ్వడంతో పాటు ఆయన నిర్మాతగా కూడా ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు.

Hyper Aadi dont want to do movies as hero

Advertisement

ఇక సుధీర్‌ కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు స్టార్‌ డమ్‌ అయితే దక్కలేదు. గెటప్ శ్రీను కూడా మొదటి సారి సోలో హీరోగా సినిమా ను చేస్తున్నాడు. ఇదే సమయంలో హైపర్ ఆదికి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరష్కరిస్తున్నాడట. బాబోయ్‌ హీరోగా నా వల్ల కాదు.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎలాంటి సినిమాలో అయినా నేను నటించేందుకు రెడీ అన్నట్లుగా ఆది ఓపెన్‌ ఆఫర్‌ ను ఇచ్చాడట. దాంతో ఆయన తెలివికి అంతా కూడా ఫిదా అవుతున్నారు. హైపర్ ఆది చాలా తెలివైన వాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి