Hyper Aadi : మీరే జీవితాన్ని ఇచ్చారు.. హైపర్ ఆది ఎమోషనల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 6, 2021, 12:20 pm

Hyper Aadi  జబర్దస్త్ షోలో హైపర్ ఆది Hyper Aadi ఇప్పుడు ఓ స్టార్. ఒకప్పుడు ఎక్కడో యూట్యూబ్‌లో సరదాకు వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు. కృష్ణకాంత్ పార్కులో అలా వీడియోలు చేసుకుంటూ ఉండే ఆదిని గుర్తించి, తన ప్రతిభకు తగ్గ స్థానాన్ని ఇచ్చాడు అదిరే అభి. అలా మొదటి సారిగా జబర్దస్త్ షో వేదికపై ఆది ప్రయాణం సాగింది. మొదట్లో స్కిట్లు రాసుకునే రైటర్‌గా ఆది కెరీర్ మొదలుపెట్టేశాడు.

Hyper Aadi Emotional on Abhi On Teachers day

Hyper Aadi Emotional on Abhi On Teachers day

మీరే జీవితాన్ని ఇచ్చారు.. హైపర్ ఆది ఎమోషనల్ Hyper Aadi

అలా అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. మొత్తంగా బుల్లితెరపై ఓ స్టార్ అయిపోయాడు. సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. అలా హైపర్ ఆది టాలెంట్ గుర్తించి అవకాశం ఇచ్చిన అభి గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ కూడా టీం లీడర్లుగా రాణిస్తున్నారు.

jabardasth auditions are going on

jabardasth auditions are going on

అయితే నిన్న టీచర్స్ డే సందర్భంగా అభి గురించి చెబుతూ ఆది ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో మాట్లాడుతూ.. అభి నాకు దేవుడితో సమానం అన్నారు. ఇక ఫేస్ బుక్‌లో పోస్ట చేస్తూ.. ‘మా తల్లిదండ్రులు జన్మనిచ్చారు. మీరు జీవితాన్ని ఇచ్చారు. మంచి-చెడు, నిజాయితీ, విలువలు ఇలా ఎన్నో మీరు నేర్పినందుకు మీకు కృతజ్ఞతలు.. హ్యాపీ టీచర్స్ డే’ అని చెప్పారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp