Hyper Aadi : కామెడీ స్టార్స్ లో హైపర్ ఆది జాయిన్‌ కాక పోవడంకు కారణం అదేనా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 23, 2022, 11:00 am

Hyper Aadi : జబర్దస్త్ నుండి తప్పుకున్న వారు సినిమా ల్లో బిజీ అవుతున్నారు లేదంటే స్టార్‌ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ ఇక్కడ లేని వారు అనే వారు ఎవరు లేరు. కాని ఇప్పుడు హైపర్ ఆది పరిస్థితి అదే అయ్యిందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే.. జబర్దస్త్‌ నుండి హైపర్ ఆది తప్పుకుని నెలలు గడుస్తోంది. ఆది ఒక్కో కాల్షీటు ధర లక్ష నుండి రెండున్నర లక్షల వరకు ఉంటుంది. అలాంటి ఆది తన డేట్లను ఇంతగా వృదా ఎలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అంటూ మీడియా వర్గాల వారు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆది ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరిలో జరుగుతున్న చర్చ.

ఒక వేళ హైపర్ ఆది వీడితే ఖచ్చితంగా స్టార్‌ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో జాయిన్ అవుతాడు అంటూ చాలా కాలం క్రితం ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు అలా జరగడం లేదు. అసలు కామెడీ స్టార్స్ లో కి హైపర్ ఆది ని ఆహ్వానించిందే లేదట. స్టార్‌మా వర్గాల వారు కాస్త డెప్త్‌ గా ఆలోచించి పూర్తిగా స్టార్‌ మా లో కామెడీ స్టార్స్ అనేది జబర్దస్త్‌ టీమ్‌ అవుతుందని.. అలా కాకూడదు అనే ఉద్దేశ్యంతో హైపర్ ఆదిని తీసుకోలేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతే కాకుండా స్టార్ మా వారికి కామెడీ స్టార్స్ తో వచ్చే ఆదాయం చాలా తక్కువ. అలాంటి సమయంలో కామెడీ స్టార్స్ లో ఆయన్ను తీసుకుంటే భారీ గా పారితోషికం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో స్టార్‌ మా వారు ఉన్నారట.

Hyper Aadi fans unhappy with his jabardasth exit

Hyper Aadi fans unhappy with his jabardasth exit

ఒక వేళ హైపర్‌ ఆది ఎంటర్‌ అయితే షో రేటింగ్‌ పెరుగుతుందా అంటే ఏమో డౌటే అన్నట్లుగా అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ పరిస్థితి నేపథ్యంలో కామెడీ స్టార్స్ నుండి హైపర్‌ ఆదికి ఆహ్వానం అందలేదు అని తెలుస్తోంది. హైపర్ ఆది కనుక సినిమాలు కమిట్‌ అవ్వడం మొదలు పెడితే వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కాని ఆయన కాస్త పెద్ద సినిమాను చూసి కమిట్ అయితే బెటర్. ఎందుకంటే చిన్న చితకా సినిమాలు చేస్తే ముందు ముందు కెరీర్ లో ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుంది అంటూ ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆది ఆచితూచి నడుస్తున్నాడు. కాని ఆయన్ను బుల్లి తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp