Hyper Aadi : తెల్లపాపతో హైపర్ ఆది వ్యవహారం.. జనాలకు ఎక్కడం లేదుగా

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 23, 2022, 6:00 pm

Hyper Aadi : బుల్లితెరపై ఢీ షోకు ఉండే క్రేజ్ వేరు. ఒకప్పుడు ఢీ షో అంటే ఎంతో సీరియస్‌గా జరిగేది. డ్యాన్స్ షో అంటే.. డ్యాన్స్ షోలానే ఉండేది. వెకిలి చేష్టలు, జిమ్నాస్టిక్ స్టెప్పులుండేవి కావు. కానీ ఇప్పుడు ఢీ షో అంటే డ్యాన్స్ షోలాలేనే లేదు. అందులో డ్యాన్స్ తప్పా మిగతావన్నీ ఉంటున్నాయి. అలా మొత్తానికి ఢీ షోను కామెడీ షోగా చేసేశారు. అది చాలదంటూ కొత్త కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. విదేశీ భామలను పట్టుకుని వస్తున్నారు. కామెడీ అన్నట్టుగా ఏదో చేయిస్తున్నారు. ఇప్పుడు ఢీ షో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పద్నాలుగో సీజన్ మరీ దారుణంగా మారిపోయింది. సుధీర్ వెళ్లిపోయాడు.. ఆ తరువాత రష్మీ వెళ్లిపోయింది.. మధ్యలో అఖిల్ సార్థక్ వచ్చాడు.. వెళ్లాడు..

అతడిని ఎవరు ఎందుకు తీసుకున్నారో వారికే తెలియాలి.. పూర్ణ పోయింది.. నందితా శ్వేత వచ్చింది. గణేష్ మాస్టర్ స్థానంలో జానీ మాస్టర్ వచ్చాడు. అలా ఎన్నో మార్పులు చేర్పులకు గురవుతూ వస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఓ గాడిలో పడ్టట్టు అనిపిస్తోంది. ఇక రవికృష్ణ, నవ్యస్వామిల్లో ఎవరో ఒకరు డుమ్మా కొడుతున్నారు. తాజాగా యూట్యూబర్ నిఖిల్ వచ్చాడు. గత వారం ఎపిసోడ్‌లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లీష్ పాపతో వచ్చాడు. రష్యాలో చదువుకున్నప్పుడు తన ఫ్ఱెండ్ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.ఆ తెల్లపాప ఏం మాట్లాడుతుందో.. ఏం అంటుందో ఎవ్వరికీ అర్థం కాదు.

Hyper Aadi Fun WIth Russian Girl In Dhee Show

Hyper Aadi Fun WIth Russian Girl In Dhee Show

అదే ఓ కామెడీ అని మనం అనుకోవాలి.. అంతే మీ ఖర్మ.. అన్నట్టుగా ఢీ డైరెక్షన్ టీం చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ ఆమెకు సగానికి పైగా టైం కేటాయించారు. అలా ఈ ప్రోమోలో మొత్తం ఆ తెల్లపాప, హైపర్ ఆది వ్యవహారమే ఉంది. అది ఏ మాత్రం కూడా వర్కవుట్ కాలేదు. తెల్లమ్మాయి ఏదేదో అనేస్తుంది ఆమె భాషలో.. అది మన వాళ్లకి ఏం అర్థం అవ్వడంలేదు..ఇక అర్థం కావడం లేదు కాబట్టి.. అదే కామెడీ అనుకుని నవ్వాలి.. అక్కడి వారంతా అదే చేస్తున్నారు.. కాబట్టి చూసే జనాలు కూడా నవ్వాల్సిందే అన్నట్టుగా ఉంది. మొత్తానికి ఢీ షో గాడిలో పడింది అనేది వట్టి భ్రమ అని నిరూపించారు. సుధీర్ వెళ్లినప్పటి నుంచి ఢీ ధీనావస్థలోకి వెళ్లిపోయింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp