
Hyper Aadi social media trolls goes viral
Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. అందరినీ నవ్వించడమే ఆదికి తెలుసు. ఆది తన పర్సనల్ ప్రాబ్లమ్స్, వ్యక్తిగత జీవితం గురించి తెరపై ఎప్పుడూ చెప్పలేదు. బయట ఎక్కడైనా ఇంటర్వ్యూలో తన బాధలు,కష్టాల గురించి చెబుతాడేమో గానీ తెరపై మాత్రం అందరినీ నవ్వించేందుకు మాత్రమే ప్రయత్నిస్తుంటాడు. అలా ఆది ఇప్పుడు బుల్లితెరపై ఓ స్టార్‌లా మారిపోయాడు. ఆదికి ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద తిరుగు లేకుండా పోయింది. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో ఆది దుమ్ములేపుతున్నాడు. ఇక ఆది విషయానికి వస్తే.. పరదేశీ, దొరబాబు కుటుంబాలు అయితే దేవుడిలా కొలుస్తాయి. వైజాగ్ ఘటనలో పరదేశీ, దొరబాబులను బయటకు తీసుకొచ్చాడు ఆది.
తన ఇంఫ్లూయెన్స్ ఉపయోగించి.. బయటకు పట్టుకొచ్చాడు. అప్పటి నుంచి వారికి కనిపించే దేవుడిలా మారిపోయాడు. వారి కుటుంబాలు సైతం ఆది మేలుని ఎప్పటికీ మరిచిపోవు. దొరబాబు భార్య, పరదేశీ అమ్మ, అక్కలు కూడా ఆది గురించి ఎంతో గొప్పగా చెప్పేశారు. స్టేజ్ మీదే ఆది గురించి చెబుతూ అతను మా పెద్ద కొడుకు అని అనేశారు. అలా ఆది వారి కుటుంబాలను ఆదుకున్నవాడయ్యాడు. ఇక తాజాగా రాఖీ ఈవెంట్ నిర్వహించింది మల్లెమాల. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు గెస్టులుగా వచ్చారు. పరదేవీ తన అక్కతో , భాను తన అన్నతో, రోల్ రైడా తన చెల్లితో ఇలా అందరూ వచ్చారు.
Hyper Aadi Gets Emotional for pardesi sister in Etv Rakhi event
ఇక పరదేశీ అక్క వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అక్కా ఇది గ్రాండ్ ఈవెంట్ కదా? అని అంటే.. వచ్చినప్పుడు అలానే అనుకున్నా.. కానీ నువ్ డ్యాన్స్ వేయడంతో ఇది మా కొడుకు బర్త్ డే పార్టీయే బెటర్ అని అనుకున్నా అంటూ కౌంటర్లు వేస్తుంది. ఇక పరదేశీ వాళ్ల అక్క.. ఆదికి రాఖీ కడుతుంది. దీంతో ఆది ఎమోషనల్ అవుతాడు. మా ఇంట్లో మేం ముగ్గురం అన్నదమ్మలమే.. ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ మొదటి సారి.. ఇది నాకు మొదటి సారి అంటూ రాఖీ చూసి ఎమోషనల్ అయ్యాడు. రాఖీ కట్టడమే కాదు.. గిఫ్ట్ కూడా ఇవ్వడంతో ఆది మరింత షాక్ అయ్యాడు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.