Hyper Aadi : వామ్మో ఇదెక్కడి దారుణం .. హైపర్ ఆది కిడ్నాప్ అయ్యాడు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : వామ్మో ఇదెక్కడి దారుణం .. హైపర్ ఆది కిడ్నాప్ అయ్యాడు !

Hyper Aadi : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పరిచయమైన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. అలాంటి హైపర్ ఆది కిడ్నాప్ కి గురయ్యాడు. దాదాపుగా 10 గంటలపాటు కిడ్నాపర్లు అన్నం నీళ్లు లేకుండా హైపర్ ఆదిని మాడ్చారు. దీంతో హైపర్ ఆది కిడ్నాప్ బుల్లితెరపై కలకలం రేపింది. జబర్దస్త్ షో ద్వారా హైపర్ ఆది […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 July 2023,8:00 pm

Hyper Aadi : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పరిచయమైన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. అలాంటి హైపర్ ఆది కిడ్నాప్ కి గురయ్యాడు. దాదాపుగా 10 గంటలపాటు కిడ్నాపర్లు అన్నం నీళ్లు లేకుండా హైపర్ ఆదిని మాడ్చారు. దీంతో హైపర్ ఆది కిడ్నాప్ బుల్లితెరపై కలకలం రేపింది. జబర్దస్త్ షో ద్వారా హైపర్ ఆది చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. టీమ్ మెంబర్ గా అదిరే అభి టీంతో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తన టాలెంట్ తో టీం లీడర్ అయ్యాడు. జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

అసలు హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ అన్నట్లు షో సాగేది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్, జబర్దస్త్ లో హైపర్ ఆది టీం ప్రేక్షకుల ఫేవరేట్ అయిపోయారు. హైపర్ ఆది కామెడీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేవారు. కొందరు అయితే కేవలం హైపర్ ఆది స్కిట్ లో మాత్రమే చూసేవాళ్ళు. ఆ తర్వాత హైపర్ ఆది ఢీ షో కి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ షోలో యాంకర్స్ల జడ్జెస్ మధ్య పేలే పంచులు అన్ని హైపర్ ఆది రాసేవే. అతడు వచ్చాక ఢీ షో కి మరింత ఆదరణ పెరిగింది. అలాంటి క్రేజ్ ను ఇంకా హైపర్ ఆది కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే హైపర్ ఆది పంచులు ఎంత నవ్విస్తాయో అంత వివాదం రాజేస్తాయి. చాలాసార్లు హైపర్ ఆది పంచులు వేసి క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

Hyper Aadi had been kidnapped while he was in a show

Hyper Aadi had been kidnapped while he was in a show

ప్రభుత్వాలు, కొన్ని సామాజిక వర్గాలు, మహిళలను ఉద్దేశిస్తూ ఆయన రాసిన జోక్స్ వివాదాస్పదం అయ్యాయి. ఆడవాళ్ళపై కూడా ఆది పంచులు ఘాటుగానే ఉంటాయి. ఆ మధ్య నైటీలు బ్యాన్ చేయాలని షోలో అన్నారు. ఆడవాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న హైపర్ ఆదికి బుద్ధి చెప్పాలని మహిళలు డిసైడ్ అయ్యారు. దీంతో అతడిని కిడ్నాప్ చేశారు. అయితే ఇది నిజమైన కిడ్నాప్ కాదు. పాపులర్ నటీమణులు హైపర్ ఆదిని కిడ్నాప్ చేశారు. ఆడవాళ్లను గౌరవించనందుకు నీకు శిక్ష వేస్తాం అన్నారు. అయితే మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మీరు ఈ శిక్ష వేసిన స్వీకరిస్తానని హైపర్ ఆది చెప్పాడు. ఈ స్కిట్లో కూడా హైపర్ ఆది తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ అలరించారు. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆది తన స్కిట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది