Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ వీడెవడండీ బాబు… చేజేతులా ట్రోఫీని బిందు మాధవికి ఇస్తున్న అఖిల్
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో కు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ప్రతి సీజన్లో కూడా కొందరు కంటెస్టెంట్స్ కి ఫ్యాన్స్ ఏర్పడతారు. ఫాన్స్ సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు బిందు మాధవి అభిమానులు సోషల్ మీడియా లో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఆమెకు ఒక రేంజ్ లో అభిమానులు ఏర్పడ్డారు. ఏకంగా ఆర్మీ పెట్టి ఆమె ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సమయంలో గంపగుత్తగా ఓట్లు వేస్తూ ఆమె సేవ్ అవడం లో కీలక పాత్ర పోషిస్తున్నారు అనడంలో సందేహం లేదు.
ఇదే జోష్ తో ఆమె ని విజేత గా కూడా నిలుపుతామని అంటూ వారు ధీమా గా ఉన్నారు. ఈ సమయం లో అఖిల్ యొక్క అభిమానులు కూడా తమ అభిమాన కంటెస్టెంట్ ను విజేతగా నిలుపుతాం అంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా హడా వుడి చేయడం మొదలు పెట్టారు. కానీ తాజా ఎపిసోడ్ లో బిందు మాధవి వర్సెస్ అఖిల్ అన్నట్లుగా జరిగినప్పుడు అఖిల్ కన్నీళ్లు పెట్టుకోవడం ఆయన అభిమానులకు నచ్చడం లేదు. కావాలని అఖిల్ ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకొని సింపతి కొట్టే ప్రయత్నం చేసినట్లుగా అక్కడి సందర్భం ఉంది అంటూ అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా సింపతి కోసం ప్రయత్నించే వారికి జనాలు ఓట్లు వేయరు.. ఒకవేళ ఇప్పుడు ఓట్లు వేసిన చివరికి కచ్చితంగా ఆయనకు నిరాశ తప్పదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిందు మాధవిని పదే పదే అఖిల్ టార్గెట్ చేస్తూ ఆమెను బలమైన కంటెస్టెంట్ గా మారుస్తున్నాడు అనేది కొందరి అభిప్రాయం. అందుకే సోషల్ మీడియాలో అఖిల్ చేతుల ఆమెను విజేతగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ విషయంలో బిందుమాధవి అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే బిందు మాధవి టాప్ కంటెస్టెంట్ గా మారిపోయింది. ఈ సమయంలో అఖిల్ ఇలా వ్యవహరిస్తే కష్టమే అనేది చాలా మంది వాదన.